Interesting Facts About Foot Fingers Hair: మనలో చాలా మందికి ఒళ్లంతా రోమాలు ఉంటాయి. మరికొందరికి అక్కడక్కడ వెంట్రుకలు ఉంటే, ఇంకొందరికి అస్సలు వెంట్రుకలే ఉండవు. తెల్లగా ఉండేవారికి రోమాలు పెద్దగా ఉండవు. అయితే కాలి వేళ్లపై లేదా బొటనవేలుపై వెంట్రుకలు పెరగడం శుభ సంకేతమా లేదా అశుభమా? అసలు జ్యోతిష్యులు ఏం చెబుతున్నారు?
సాముద్రిక శాస్త్రం ప్రకారం, కాలి వేళ్లపై వెంట్రుకలు పెరగడం ఓ అసాధారణ లక్షణం. ఇవి కొంత మందికి స్పష్టంగా ఉంటే, మరికొందరికి అస్పష్టంగా ఉంటాయి. అయితే ఇలా రోమాలు ఉండటం శుభకరమని శాస్త్రం చెబుతోంది. ఇలాంటి వ్యక్తులు లగ్జరీగా బతుకుతారు. వారు ఏది కోరుకుంటే అది దక్కుతుంది. వీరి కీర్తి నలుదిక్కులా వ్యాపిస్తుంది. లక్ ఎప్పుడు మీ వెంటే ఉంటుంది. ఆర్థికంగా ఎదుగుతారు. కెరీర్ లో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. జీవన ప్రయాణం సాఫీగా సాగిపోతుంది.
మీ బాధ్యత పెరుగుతుంది. మీ వ్యక్తిత్వం, లీడర్ షిప్ క్వాలిటీస్ తో నలుగురిని ఆకట్టుకుంటారు. మీ అభిప్రాయాలను అందరూ గౌరవిస్తారు. సమాజంలో మీ పరపతి పెరుగుతుంది. మీరు ఎలాంటి కఠిన పరిస్థితుల్లోనైనా నిర్ణయాలు తీసుకోవడానికి వెనుకాడరు. జ్ఞానాన్ని పదిమందికి పంచుతారు. మిమ్మల్ని అందరూ మెచ్చుకుంటారు. మీ జీవితభాగస్వామి మీతో సుఖంగా ఉంటుంది. మీకు ఆధ్యాత్మికతపై మక్కువ పెరుగుతుంది. అన్ని కళల్లోనూ ఆరితేరుతారు.
కాలిపై వెంట్రుకల ఉండే వ్యక్తులు కొన్ని లక్షణాలు మార్చుకోవాల్సి ఉంటుంది. వీరికి మంత్ర తంత్రాలపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటి జోలికి వెళ్లకుండా ఉంటే మంచిది. అంతేకాకుండా ఈ వ్యక్తులకు కోపం, అహంకారం కూడా మెండుగా ఉంటాయి. ఇలాంటి సమయంలో వారు యోగా, ధ్యానం చేసి మనసులో అదుపులో పెట్టుకోవాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. అయితే కాళ్లపై రోమాలు ఉండేవారికి గుండె జబ్బులు కూడా వచ్చే అవకాశం ఉందని శాస్త్రం చెబుతోంది.