Wednesday, June 25, 2025
Homeబిజినెస్IndiGo Monsoon Offer: ఇండిగో 'మాన్సూన్ సేల్'.. రూ. 1499 లకే విమాన టికెట్!

IndiGo Monsoon Offer: ఇండిగో ‘మాన్సూన్ సేల్’.. రూ. 1499 లకే విమాన టికెట్!

IndiGo Flight Offers: ఇండిగో ఎయిర్‌లైన్స్ తమ ప్రయాణికులను ఆకట్టుకునేందుకు ‘మాన్సూన్ సేల్’ను ప్రకటించింది. ఈ సేల్‌లో భాగంగా డొమెస్టిక్‌, ఇంటర్నేషనల్‌ విమాన ఛార్జీలపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. వేసవి కాలంలో ప్రయాణాలను మిస్‌ చేసుకున్న వాళ్లు ఇదొక సువర్ణావకాశంగా చెప్తోంది ఇండిగో. అసలు ఈ ఆఫర్‌ ఏంటి? టికెట్‌ ధరలు ఎంత నుంచి ప్రారంభం అవుతున్నాయో ఈ కథనంలో చూద్దాం..

‘మాన్సూన్ సేల్’ కింద జూన్ 24 నుంచి జూన్ 29, 2025 మధ్య టికెట్స్‌ బుకింగ్‌ చేసుకున్న కస్టమర్లకు భారీ డిస్కౌంట్లు వర్తిస్తాయని ఇండిగో ఎయిర్‌లైన్స్‌ తెలిపింది. ఈ సేల్ కింద బుక్ చేసుకున్న టిక్కెట్లపై జూలై 1 నుంచి సెప్టెంబర్ 21, 2025 మధ్య కస్టమర్లు తమ ప్రయాణాలు కొనసాగించవచ్చని పేర్కొంది. ఈ ఆఫర్‌ ద్వారా ప్రయాణికులను ఆకట్టుకునే వినూత్న ప్రయత్నానికి ఇండిగో తెరలేపింది.  

ఆఫర్ ఏంటంటే?:
డొమెస్టిక్‌ విమాన ఛార్జీలు: కేవలం రూ.1,499 లకే వన్-వే ప్రయాణ సదుపాయాన్ని ఇండిగో ప్రకటించింది.

అంతర్జాతీయ విమాన ఛార్జీలు: రూ.4,399 నుంచి ఇంటర్నేషనల్‌ వన్-వే ప్రయాణాలు ప్రారంభమవుతాయి.

బిజినెస్ క్లాస్: ఇండిగో బిజినెస్ క్లాస్ టిక్కెట్లను ఆఫర్‌ కింద కేవలం రూ.9,999 నుంచే టికెట్లను అందిస్తుంది.

అయితే.. ఈ డిస్కౌంట్ ఛార్జీలు ప్రతి విమానం ధర దాని సీట్ల లభ్యతపై ఆధారపడి ఉంటాయని ఇండిగో ఎయిర్‌లైన్స్ స్పష్టం చేసింది.

యాడ్-ఆన్ సేవలపై డిస్కౌంట్స్‌
ఇండిగో కేవలం విమాన టికెట్‌ ఛార్జీలపైనే కాకుండా.. పలు యాడ్-ఆన్ సేవలపై కూడా ఈ ఎయిర్‌లైన్స్‌ డిస్కౌంట్లను ప్రకటించింది.

అదనపు బ్యాగేజీ బెనిఫిట్స్‌: దేశీయ విమానాలకు ప్రీపెయిడ్ అదనపు బ్యాగేజీపై 50 శాతం వరకు డిస్కౌంట్‌తో లభిస్తుంది. అంతర్జాతీయ విమానాలకు 15 కిలోలు, 20 కిలోలు, 30 కిలోల అలవెన్సులపై కూడా డిస్కౌంట్లు ఇండిగో ‌అందించనుంది.

ఫాస్ట్ ఫార్వర్డ్ సర్వీస్: విమానాశ్రయ భద్రతా తనిఖీల వద్ద ప్రయాణికులకు వేగంగా సేవల్నీ అందించే ‘ఫాస్ట్ ఫార్వర్డ్’ సర్వీసుపై 50 శాతం వరకు డిస్కౌంట్‌ని ప్రకటించింది. 

సీటింగ్‌ ఆప్షన్స్‌: ఇండిగో ఎయిర్‌లైన్స్‌ ఎంపిక చేసిన డొమెస్టిక్‌, అంతర్జాతీయ రూట్లలో స్టాండర్డ్ సీటింగ్‌ ఆప్షన్‌ ధర కేవలం రూ.99 నుంచే ప్రారంభమవుతాయి. అత్యవసర XL (ఎక్స్‌ట్రా లెగ్‌రూమ్) సీట్ల కోసం దేశీయ విమానాలపై రూ.500 డిస్కౌంట్ కూడా ఉంది.

జీరో క్యాన్సిలేషన్ ప్లాన్: కస్టమర్లు తమ బుకింగ్ సమయంలో అతి తక్కువ ధర రూ.299 చెల్లించి జీరో క్యాన్సిలేషన్ ప్లాన్‌తో టికెట్‌ బుక్‌ చేసుకోవచ్చని ఇండిగో తెలిపింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News