TG Weather updates: రాష్ట్రంలో నిన్నటితో పోలిస్తే నేడు వాతావరణంలో స్వల్ప మార్పులు చోటు చేసుకోకున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో ఈరోజు కూడా మంచి వర్షాలు కొనసాగుతాయని తెలిపింది. గంటకు 40 నుంచి 60 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.
మధ్యాహ్నం నుండి అర్ధరాత్రి వరకు పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు:
- నిర్మల్
- నిజామాబాద్
- జగిత్యాల
- పెద్దపల్లి
- కరీంనగర్
- మంచిర్యాల
- భూపాలపల్లి
- ములుగు
- భద్రాద్రి
వీటితో పాటు మిగతా జిల్లాల్లో, మధ్యాహ్నం నుండి రాత్రి వరకు అక్కడక్కడా తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
నేడు హైదరాబాద్ లో:
హైదరాబాద్ లో గత రెండు రోజులుగా ఉన్నట్లే, ఈరోజు కూడా సాయంత్రం నుండి రాత్రి వరకు మాత్రమే వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది.
గడిచిన 24 గంటల్లో:
పది రోజుల విరామం తర్వాత రైతులకు కాస్త ఊరట లభించింది. ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో అద్భుతమైన వర్షాలు కురిశాయి. ఇవి వ్యవసాయ కార్యకలాపాలకు సహాయ పడతాయని నిపుణులు చెబుతున్నారు. పశ్చిమ, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు నమోదయ్యాయి.