Wednesday, June 25, 2025
Homeగ్యాలరీBank jobs 2025: ఎస్‌బీఐలో ప్రొబేషనరీ ఆఫీసర్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌

Bank jobs 2025: ఎస్‌బీఐలో ప్రొబేషనరీ ఆఫీసర్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌

SBI Bank jobs 2025: బ్యాంకు జాబ్ కొట్టాలని ఎంతో మంది యువత ప్రిపేర్ అవుతూ ఉంటారు. అలాంటి వారి కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభవార్త అందించింది. ప్రొబేషన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

- Advertisement -

ఈ నోటిఫికేషన్‌ ప్రకారం మొత్తం 541 పోస్టులను భర్తీ చేయనుంది. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు జూన్‌ 24వ తేదీ నుంచి జులై 14 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.

అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి ఏప్రిల్‌ 01, 2025వ తేదీ నాటికి 21 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10- 15 ఏళ్లు వయోపరిమితిలో మినహాయింపు ఉంటుంది.

దరఖాస్తు ఫీజు కింద జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు రూ.750 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు అవసరం లేదు. మొత్తం మూడు దశల్లో ఎంపిక ప్రక్రియ కొనసాగుతుంది. ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. ఉద్యోగానికి ఎంపికైన వారికి నెలకు రూ.48,480 జీతంతోపాటు ఇతర అలవెన్సులు లభిస్తాయి.

కేటగిరీల వారీగా ఖాళీల వివరాలు.. ఎస్సీ కేటగిరీలో 80 పోస్టులు, ఎస్టీ కేటగిరీలో 73, ఓబీసీ కేటగిరీలో 135 పోస్టులు, ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీలో 50, అన్ రిజర్వ్ కేటగిరీలో 203 పోస్టులు ఉన్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News