Pomegranate Benefits: మనం తీసుకునే ఆహారంపై మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. అయితే, ప్రతిరోజు దానిమ్మ పండు తింటే శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతాయో తెలుసా..? దానిమ్మ పండు ఒక సూపర్ ఫుడ్ కంటే తక్కువ కాదని చెప్పొచ్చు. ఆయుర్వేదం, ఆధునిక శాస్త్రం రెండిటిలోనూ దానిమ్మ పండు ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా పరిగణిస్తారు. ఈ పండులో ఉండే పోషకాలు ఆరోగ్యానికి సంబంధించిన అనేక సమస్యలను తొలగించడంలో సహాయపడుతుంది. అయితే, ప్రతిరోజు దానిమ్మ పండు తినడం ప్రారంభిస్తే శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
దానిమ్మ పండులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని బలంగా చేస్తాయి. దానిమ్మను క్రమం తప్పకుండా తీసుకుంటే జలుబు, ఇన్ఫెక్షన్, ఇతర వ్యాధులతో పోరాడే సామర్థ్యం పెరుగుతుంది.
ఇందులో ఉండే పాలిపెనాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు చెడు కొలెస్ట్రాల్ ను సులభంగా తగ్గిస్తాయి. అంతేకాకుండా మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతాయి. రక్తపోటు ఉన్నవారు వీటిని తింటే ఎంతో మంచిది. గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.
దానిమ్మ పండు లో ఉండే ఐరన్ హిమోగ్లోబిన్ ను పెంచుతుంది. ముఖ్యంగా రక్తహీనతతో బాధపడేవారు దానిమ్మ పండును తింటే ప్రయోజనకరంగా ఉంటుంది.
దానిమ్మ పండులో ఫైబర్ అధికంగా ఉంటుంది. దీంతో జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. ఈ పండు మలబద్ధకం, గ్యాస్ వంటి సమస్యల నుండి ఉపశమనం అందిస్తుంది.
దానిమ్మ పండు లో ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని మెరిసేలా చేస్తారు. అంతేకాకుండా ముఖంపై ముడతలను తగ్గిస్తాయి. దీని వినియోగం జుట్టును బలపరిచి జుట్టు రాలడానికి నివారిస్తుంది.
బరువు తగ్గాలనుకునే వారు దానిమ్మ పండును తీసుకుంటే ఎంతో మంచిది. ఎందుకంటే ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్ అధికంగా ఉంటుంది. వీటిని తింటే కడుపు ఎక్కువసేపు నిండుగా ఉన్న భావన కలుగుతుంది. బరువు తగ్గాలనుకునే వారు వీటిని తింటే సులభంగా బరువు తగ్గవచ్చు.
దానిమ్మ పండు శక్తిని పెంచడంలో, అల్జీమర్స్ అంటూ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. అందువల్ల ప్రతిరోజు దానిమ్మ పండు తింటే మెదడు ఆరోగ్యంగా ఉంటుంది. వృద్ధాప్యంతో సంభవించే జ్ఞాపకశక్తి సంబంధిత సమస్యల ప్రమాదాన్ని సైతం తగ్గిస్తుంది.
Pomegranate: రోజుకో దానిమ్మ పండు తినడం వల్ల శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతాయో తెలుసా..?
సంబంధిత వార్తలు | RELATED ARTICLES