Wednesday, June 25, 2025
Homeబిజినెస్Jeff Bezos marriage :జెఫ్ బెజోస్ మళ్ళీ పెళ్లికి సిద్ధం..కానీ ఈసారి 'ప్రీనప్'తోనే!

Jeff Bezos marriage :జెఫ్ బెజోస్ మళ్ళీ పెళ్లికి సిద్ధం..కానీ ఈసారి ‘ప్రీనప్’తోనే!

Jeff Bezos prepares for marriage : అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ మరోసారి పెళ్లికి రెడీ అయ్యారు, కానీ ఈసారి మాత్రం చాలా జాగ్రత్తపడ్డాడు. ఎందుకంటే, గతంలో తన విడాకులు చాలా కాస్ట్లీ కాబట్టి, ఇప్పుడు ఆస్తుల విషయంలో కేర్ తీసుకున్నాడు. ఇప్పుడు మళ్లీ ఏమైనా తేడా వస్తే, మళ్లీ సగం ఆస్తులు ఇవ్వకుండా అన్ని డాక్యుమెంట్లను పూర్తిగా తన నియంత్రణలో ఉండేలా చూసుకున్నాడు. ఆయన తన మొదటి భార్య మ్యాకెంజీ స్కాట్తో విడాకులు పొందినప్పుడు దాదాపు 165 బిలియన్ డాలర్ల విలువైన ఆస్తులు ఇవ్వాల్సి వచ్చింది. ప్రపంచ చరిత్రలో ఇదొక అత్యంత ఖరీదైన విడాకులుగా నిలిచింది. గత విడాకుల్లో $165 బిలియన్ విలువైన ఆస్తులు పోయిన తర్వాత, ఈసారి లారెన్ సాంచెజ్‌తో వివాహానికి ముందు చట్టపరమైన ఒప్పందం చేసుకున్నారు.. దీనినే ‘ప్రీనప్’ అంటారు. అంటే జెఫ్ బెజోస్ లారెన్ సాంచెజ్‌తో పెళ్లికి ముందే చట్టపరమైన ప్రీనప్షువల్ ఒప్పందాన్ని (Prenuptial Agreement) సిద్ధం చేశారు. ఇది బిలియనీర్‌ల చరిత్రలో అత్యంత కఠినంగా, శ్రద్ధతో తయారుచేసిన ఒప్పందంగా పరిగణిస్తున్నారు.

- Advertisement -

ప్రినప్ అంటే పెళ్లికి ముందు ఇద్దరు భాగస్వాముల మధ్య చేసుకునే చట్టపరమైన ఒప్పందం.. వివాహం అనంతరం విడాకులు జరిగితే ఆస్తుల, ఆదాయాల, వ్యాపార వాటాల విభజన ఎలా జరగాలో ముందుగానే స్పష్టంగా పేర్కొనబడుతుంది.

ఇది సాధారణంగా సంపన్నులు, ముఖ్యంగా బిలియనీర్‌లు చేసే తప్పనిసరి జాగ్రత్త. ప్రత్యేకించి బహుళ వ్యాపారాల్లో పాల్గొనేవారికి, ఇలాంటి ఒప్పందాలు ఆస్తులను కాపాడేందుకు మరియు ప్రతిష్ఠను రక్షించేందుకు అవసరం అవుతాయి.

జెఫ్ బెజోస్ 1993లో మ్యాకెంజీ స్కాట్‌ను వివాహం చేసుకున్నారు. అమెజాన్ ప్రారంభ దశల నుంచి ఆమె ఆయనతో కలిసి ఉన్నారు. కానీ 2019లో విడిపోయారు. ఆమెకు అమెజాన్‌లో 4 శాతం షేర్లు ఇచ్చారు. దీని వలన మ్యాకెంజీ ప్రపంచంలో అత్యంత సంపన్న మహిళలలో ఒకరిగా మారారు.

అప్పుడు ప్రీనప్ లేకపోవడం వల్ల భారీ ఆస్తి కోల్పోవాల్సి వచ్చింది. అందుకే ఈసారి బెజోస్ ఎటువంటి అనవసర సమస్యలు ఎదురవకూడదని ముందుగానే చాలా జాగ్రత్తలు తీసుకున్నారు.

ఈసారి ఒప్పందం ఎలా ఉంటుంది?

లారెన్ సాంచెజ్తో చేసే ఈ ప్రీనప్ ఒక సాధారణ చట్టపరమైన పత్రం కాదు. ఇది ఒక హై-స్టేక్స్ బిజినెస్ డీల్ లాగా రూపొందించబడింది అని అల్ఫాన్స్ ప్రోవిన్జియానో అనే లాయర్ తెలిపారు. ఈ ఒప్పందంలో పూర్తి ఆర్థిక సమాచారం, వ్యాపార వాటాల రక్షణ, విడాకుల సమయంలో అందాల్సిన పింఛన్, ఆస్తుల వివరాలు, గోప్యతా నిబంధనలు ఉన్నాయు. ఇంకా పరువు నష్టం నివారణ, బిల్లియనీర్‌కు సంబంధించిన హోల్డింగ్స్, ట్రస్ట్‌లు మొదలైనవి వివరంగా ఉంటాయి.

బెజోస్ ఆస్తులు చాలా కంపెనీల్లో, ట్రస్ట్‌లలో పంచిపెట్టబడి ఉండటం వలన, పూర్తిగా పారదర్శకంగా ఉండేలా అందరి లీగల్ టీంలు కలిసి పని చేశాయి. ముఖ్యంగా లారెన్‌కి సొంత లాయర్ ఉండేలా, ఒత్తిడి లేకుండా సమయం ఇచ్చేలా చూసారు.

లారెన్‌కు ఏమి లభించవచ్చు?

సరిగ్గా ఒప్పందం వివరాలు గోప్యతగా ఉండినా, లీగల్ నిపుణుల అంచనాల ప్రకారం: ప్రతి ఒక్క సంవత్సరం పెళ్లి జీవితానికి $1 మిలియన్ వరకు అలిమనీ, కొన్ని విలాసవంతమైన ఆస్తులపై హక్కు, బహుళ ఆస్తులు ఆమె పేరున వచ్చే అవకాశం కూడా ఉంది. అంతేకాదు, బెజోస్‌కి ఉన్న నాలుగు పిల్లల భవిష్యత్తు రక్షణ కూడా ప్రీనప్‌లో ఉండేలా చూడటం జరిగింది.

పెళ్లి వేడుక ఎప్పుడు?

ఈ ప్రేమజంట ఇటలీ దేశంలోని వెనిస్ నగరంలో జూన్ 24 నుండి 26 మధ్య భారీగా వివాహ వేడుక చేసుకోవడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే విఐపి అతిథుల జాబితా, ప్రైవేట్ జెట్‌లు, భద్రతా ఏర్పాట్లపై ప్రపంచ మీడియా దృష్టి పెట్టింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News