Saturday, September 21, 2024
Homeనేరాలు-ఘోరాలుKadapa: డాక్టర్ అచ్చన్న హత్య కేసులో ముగ్గురి అరెస్ట్

Kadapa: డాక్టర్ అచ్చన్న హత్య కేసులో ముగ్గురి అరెస్ట్

కడపలోని పశువైద్య శాఖ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ అచ్చన్న అపహరణ, హత్య కేసులో ముగ్గురు అరెస్టు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. కడప నగరంలోని పశువైద్య శాఖలో డిప్యూటి డైరెక్టర్ డాక్టర్ అచ్చన్న అపహరణ, హత్య కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్.పి శ్రీ కే.కే.ఎన్ అన్బురాజన్ ఐ.పి.ఎస్ తెలిపారు. అరెస్టయిన నిందితుల వివరాలు:

- Advertisement -
  1. డా. సుభాష్ చంద్ర బోస్ (43 ), అసిస్టెంట్ సర్జన్, పశువైద్యశాల, కడప
  2. బావలూరి చెన్నకృష్ణ (44), జాతివర్తి పల్లి గ్రామం, చింతలపల్లి (పోస్టు), కలసపాడు మండలం, వై.ఎస్.ఆర్ జిల్లా
  3. మూడే బాలాజీ నాయక్ (26), ఇందిరమ్మ కాలని, గుర్రంకొండ, అన్నమయ్య జిల్లా


డా.అచ్చన్న 2021 నుండి కడపలోని వెటర్నరీ పాలీ క్లినిక్‌లో డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. నిందితుడు డా. సుభాష్ చంద్రబోస్ 2022 నుండి అదే ఆసుపత్రిలో Asst., Surgeon గా పనిచేస్తున్నారు. డ్యూటీ విషయాలలో డాక్టర్ అచ్చన్న వర్సెస్ డాక్టర్ సుభాష్ చంద్ర బోస్ మధ్య కొన్ని తీవ్రమైన అపార్థాలు, వివాదాలు వచ్చి ఉన్నాయి. డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ అచ్చన్నపై వైద్యులు, సిబ్బంది జీతాలను 3 నెలల పాటు నిలిపివేసి వారిని CFMS మరియు FRS సిస్టముల నుండి తొలగించి ప్రభుత్వానికి సరెండర్ కుడా చేశారు. ఇదే ఈ నేరానికి ప్రధాన కారణమంటూ పోలీసులు వెల్లడించారు కూడా.
దీంతో డాక్టర్ అచ్చన్న ను ఎలాగైనా హత్య చేయాలని నిర్ణయించుకున్న A1 డా. సుభాష్ చంద్రబోస్ తేదీ 09.03.2023 న పోరుమామిళ్ల కు వెళ్లి అక్కడ వినాయక లాడ్జి లో తనకు వరుసకు బావమరిది అయిన నిందితుడు A2 బావలురి చెన్న కృష్ణ ను, మెడికల్ స్టోర్ పార్ట్ నర్ అయిన A3 మూడే బాలాజి నాయక్ లాడ్జిలో కలుసుకుని అక్కడే ఉండి 11వ తేదీ వరకు కుట్ర పన్ని 11.03.2023 సాయత్రం 4.౦౦ PM గంటలకు బొలెరో పికప్ వాహనంతో కడపకు తిరిగి వచ్చారు. . కడపకు వచ్చిన వారు నిందితుడు A1 డా. సుభాష్ చంద్రబోస్ ఇంట్లో బస చేసి మరుసటి రోజు అమలు చేయాలనే ముందస్తు ప్రణాళికను సిద్దం చేసుకున్నారు.

తేదీ 12.03.2023 ఉదయం 11.00 గంటలకు CSI చర్చి సమీపంలోని చర్చి కి వెళ్లి వస్తున్న డాక్టర్ అచ్చన్న ను నిందితులు బలవంతముగా అపహరించి వాహనంలో ఎక్కించుకుని అదే వాహనములో రాయచోటి కి తిసుకుపొయినారు అతని చేత మద్యం త్రాగించి మరియు రాయచోటి శివార్లలో చికెన్ తినిపించి మద్యహ్నం సుమారు 1.30 సమయములో గువ్వల చెరువు ఘాట్ రోడ్డుకు చేరుకున్నారు. ఆ సమయములో అచ్చెన్న మద్యం మత్తులో అపస్మారక స్థితిలో ఉన్నాడు.

అంతట A1 డాక్టర్ అచ్చన్న ను బెదిరించగా A2 మరియు A3 కాపలాగా ఉండగా, A1 డాక్టర్ అచ్చన్న ను చంపాలని ఉద్దేశ్యముతో అతని చాతి పై బలంగా కాలితో తన్నగా ఘాట్ లోని రక్షణ గోడ పై కూర్చొని ఉన్న డాక్టర్ అచ్చన్న లోయలో పడిపొయి గాయాలైనాయి. అంతట A1, A2 మరియు A3 డాక్టర్ అచ్చన్న ను అక్కడే వదిలి వెల్లిపొయినారు.

నిందితులు సాక్ష్యాధారాలను రూపు మాపేందుకు మృతుడి మొబైల్ ఫోన్‌ను తీసుకుని, మొబైల్ ఫోన్‌ను ఒక చోట, సిమ్‌కార్డును మరో చోట పారవేసారు.

తేదీ 14.03.2023న డాక్టర్ అచ్చన్న తప్పిపోయినప్పుడు, అతని కుమారుడు డాక్టర్ క్లింటన్ చక్రవర్తి కడప 1 పట్టణం U/G P.Sలో A1 మరియు ఇతర కార్యాలయ సిబ్బందిని అనుమానితులు గా పేర్కొంటూ మిస్సింగ్ కేసు పెట్టినాడు.
దర్యాప్తు సమయంలో నిందితుడు A1 మరియు మరికొందరు అనుమానిత సిబ్బందితో పాటు మరణించిన వారి CDR లను పొంది విశ్లేషించారు, ఇది డాక్టర్ సుభాష్ చంద్రబోస్‌పై అనుమానాన్ని రేకెత్తించింది.

తదనంతరం తేదీ 24.03.2023న గువ్వల చెరువు ఘాట్ వద్ద లోయలో మృతదేహాన్ని గుర్తించి రామాపురం పోలీసులు Cr.No. 37/2023, U/Sec 174 Cr.P.C. (Death cause not known) నమోదు చేసి విచారణ చేసినారు.

• తేదీ 26.03.2023 సాయంత్రం A1 to A3 వరకు నిందితులు కడప VRO ఎదుట లొంగిపోయి అతని ముందు తమ నేరాన్ని అంగీకరించారు. అనంతరం వారిని VRO గారు కడప 1 పట్టణ ఇన్‌స్పెక్టర్ ఎదుట హాజరుపరిచారు. దీనికి సంబంధించి చట్టంలోని సెక్షన్ 120(b), 364, 302, 201, r/w 34 IPC మరియు SC,ST (POA) చట్టం, 2015లోని సెక్షన్ 3 (2) (v-a)కి మార్చబడింది.

• శ్రీ ఆర్.వాసుదేవన్‌, DSP, Disha Woman PS i/c of SC,ST Cell, Kadapa వారిని దర్యాప్తు చెయ్యమని రాజశ్రీ SP గారు ఆదేశించినారు..

• నిందితులు డా. అచ్చన్నను చంపినట్లు మరియు సాక్ష్యాలను రుపుమాపినట్లు అంగీకరించారు మరియు వారి నేర ఒప్పుదలపై మృతుడి సిమ్‌కార్డును స్వాధీనం చేసుకుని స్వాధీనం చేసుకున్నారు.

• నిందితులను జుడీషియల్ రిమాండ్ నిమిత్తం కడప కోర్టులో హాజరుపరిచారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News