మావోయిస్టులకు ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో సహకరించ రాద్దని రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి ఆదేశించారు. మంచిర్యాల జిల్లా నిల్వాయి, కొటపెల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కల్లంపల్లి, వెంచపెల్లి ప్రాణహిత నదీ తీర మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలని కమిషనర్ పర్యవేక్షించి ప్రజలతో మాట్లాడారు. అనంతరం పోలీసులు మీ కోసం కార్యక్రమంలో గ్రామీణులకు నిత్యావసర వస్తువులు, బియ్యం అందజేశారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ… పోలీస్ మీ కోసం ఉన్నారు, మీ గ్రామాల్లో ఎటువంటి సమస్యలు ఉన్నా పోలీస్ దృష్టికి తీసుకువచ్చినట్లైతే సంబంధిత శాఖల అధికారులకు తెలిపి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామన్నారు.
చెన్నూర్ ప్రాంతంలో మంచిర్యాల డీసీపీ సుధీర్ రాంనాథ్ కేకన్, జైపూర్ ఏసీపీ నరేందర్ లతో కలిసి ఆమె పర్యటించారు. మావోయిస్టులకు ఎట్టి పరిస్థితుల్లో సహకరించవద్దనీ, అనుమానాస్పదంగా ఎవరైనా కొత్త వ్యక్తులు గ్రామాల్లో కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, ఎవరైనా ఉల్లంగించినట్లయితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ, సిఐ, ఎస్సై, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.