Sunday, June 15, 2025
Homeపాలిటిక్స్Politics: 500 నోట్ల వర్షం కురిపించిన సీనియర్ పొలిటీషియన్

Politics: 500 నోట్ల వర్షం కురిపించిన సీనియర్ పొలిటీషియన్

కర్నాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ పెద్ద నోట్లు విసురుతూ ఎన్నికల ర్యాలీలో పాల్గొనే వీడియో వైరల్ గా మారింది. రోడ్ షోకు వచ్చిన ప్రజలను ఉద్దేశించి డీకే శివకుమార్ 500 రూపాయల నోట్లు వెదజల్లారు.  తన సొంత ప్రాంతమైన మండ్యా జిల్లాలోని బేవినహళ్లిలో ప్రచార రథంపై నుంచి ఆయన 500 నోట్లు విసిరేశారు.

- Advertisement -

కాంగ్రెస్ ప్రచార ధ్వని యాత్రను చేపట్టిన ఆయన కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చి.. సీఎం కావాలని కలలు కంటున్నారు.  ఈ ఎన్నికల్లో సర్వం ఒడ్డుతున్న ఆయన.. మాజీ సీఎం సిద్ధరామయ్యకు గట్టి పోటీ ఇస్తున్నారు. మరోవైపు అసలు ఈ ఎన్నికల్లో సీఎం అభ్యర్థి ఎవరనే విషయాన్ని కాంగ్రెస్ హై కమాండ్ ఇప్పటికీ తేల్చలేదు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News