ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు శంభీపూర్ లోని కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రాలు అందజేశారు. స్పందించిన ఎమ్మెల్సీ సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ కుటుంబ సభ్యులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
అంతకుముందు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం శంభీపూర్ లోని కార్యాలయంలో జరిగిన బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు పాల్గొన్నారు. ఈ సందర్బంగా జగ్జీవన్ రామ్ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల ఐక్య వేదిక నాయకులు, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.