Friday, September 20, 2024
Homeనేరాలు-ఘోరాలుHyd: బండి అరెస్ట్ పై కౌంటర్ దాఖలు చేయండి: హైకోర్టు

Hyd: బండి అరెస్ట్ పై కౌంటర్ దాఖలు చేయండి: హైకోర్టు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ పై కౌంటర్ దాఖలు చేయాలంటూ తెలంగాణ హైకోర్టు పోలీసులను ఆదేశించింది. బెయిల్ పిటిషన్ ను బండి దాఖలు చేసుకోవచ్చని కోర్టు వెల్లడించింది.  ఈ మొత్తం విచారణను ఈనెల 10కి వాయిదా వేసింది.  ప్రస్తుతం ఆయన పోలీసుల అదుపులో ఉన్నారు.  టెన్త్ క్లాస్ కొషన్ పేపర్ లీకేజ్ లో బండి ప్రధాన నిందితుడంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 

- Advertisement -

ఎటువంటి ముందస్తు నోటీస్ ఇవ్వకుండానే సంజయ్ అరెస్ట్ చేయటంపై ఆయన తరపు లాయర్లు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేస్తూ, హనుమకొండ కోర్టు విధించిన 14 రోజుల రిమాండ్ ను రద్దు చేయాలని కోరారు.  ప్రస్తుతం కరీంనగర్ జైల్లో బండి ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News