కేంద్ర ప్రభుత్వం మరో విశిష్టమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నట్టు కేంద్ర హోంశాఖా మంత్రి అమిత్ షా వెల్లడించారు. ఏళ్ల తరబడి జైళ్లలో మగ్గుతున్న నిరుపేద ఖైదీల కుటుంబాలకు కేంద్రం ఆర్థిక సాయం చేయనున్నట్టు షా వెల్లడించారు. ఈమేరకు ప్రత్యేక పథకాన్ని అందుబాటులోకి తేనున్నట్టు ఆయన తెలిపారు. బెయిల్ కోసం అవసరమైన డబ్బును, పెనాల్టీలు చెల్లించలేక జైళ్లలో శిక్ష అనుభవించేవారికి కూడా తాము సాయం చేసేలా సపోర్ట్ ఫర్ పూర్ ప్రిజనర్స్ పేరుతో వారిని ఆదుకుంటామన్నారు. ఇలా జైలు జీవితం గడుపుతున్న వారిలో అత్యధిక ఖైదీలు ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడ్డ వర్గాలేనని ఆయన గుర్తుచేశారు. ఈమేరకు సాంకేతికత సాయం తీసుకుని అర్హులకు మాత్రమే ఈ సాయం అందేలా జాగ్రత్త తీసుకుంటామన్నారు. ఈ ప్రిజన్స్ ప్లాట్ ఫాం ద్వారా ఈ ప్రక్రియ అంతా సాగుంతుందన్నారు. న్యాయవ్యవస్థలో జైళ్లు కీలక పాత్ర పోషిస్తాయని, పేదలకు న్యాయసేవలు అందేలా కేంద్రం కృషి చేస్తోందన్నారు.
Poor prisoners: నిరుపేద ఖైదీల కుటుంబాలకు కేంద్ర ఆర్థిక సాయం
సంబంధిత వార్తలు | RELATED ARTICLES