Saturday, November 23, 2024
Homeనేరాలు-ఘోరాలుKangti: నేనే ఆధారం, నా బిడ్డకు సాయం చేయరూ..

Kangti: నేనే ఆధారం, నా బిడ్డకు సాయం చేయరూ..

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం కంగ్టి మండల కేంద్రంలో చంద్రమ్మ మానికొండ దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు.  మాణికొండ 12 సంవత్సరాల క్రితమే కన్నుమూయగా, చంద్రమ్మ తన రెక్కలు ముక్కలు చేసుకుంటూ పిల్లలను పోషించుకునేది.  అందులో ఇద్దరు కుమార్తెల పెళ్లిలను చేసింది.  ప్రస్తుతం చంద్రమ్మ తన చిన్న కూతురు సురేఖతో అద్దె ఇంట్లో జీవనం సాగిస్తోంది. 

- Advertisement -

ఆమె కష్టం ఎందుకంటే..

సురేఖ హఠాత్తుగా క్రింద పడిపోవడంతో హుటాహుటిన నిజామాబాద్ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.  వైద్యులు పరీక్షించి ఆమె తలలో ట్యూమర్ చీమతో నిండి ఉందని, ఆపరేషన్ గనుక చెయ్యకపోతే బ్రతికించలేమని చెప్పారు.  ఆపరేషన్ కి 6 లక్షలు ఖర్చు అవుతుందన్నారు డాక్టర్లు.  అంతటితో ఆ మాటలు విని తల్లి గుండె కదిలిపోయింది, దిక్కుతోచని స్థితిలో చంద్రమ ఆసుపత్రిలో ఒంటరిగా మిగిలిపోయింది.  ఏం చేయాలో, ఎవరిని సంప్రదించాలో కూడా చంద్రమ్మకు అర్థం కాని పరిస్థితి.  కూతుర్ని బతికించుకోవడానికి ఎలాంటి ఆస్తులు లేవు,తన రెండు చేతులు జోడించి నా కూతుర్ని బ్రతికించుకోవడానికి నా చేతిలో ఏం లేదంటూ, నా వారు అంటూ ఎవరు లేరు,నా కూతుర్ని బ్రతికించే వాళ్ళు మనసున్న మానవత్వం కలిగిన దాతలే అని కన్నీరు మున్నిరయింది. 

మానవతా వాదులు 9701636236 కు గూగుల్ పే గాని, ఫోన్ పే చేసి నా కూతుర్ని బ్రతికించడని వేడుకుంది.  వెంటనే బి.ఆర్.ఎస్ నాయకుడు కృష్ణ స్పందించి సురేఖ ఆసుపత్రిలో ఏ స్థితిలో ఉందో ఆ చిత్రాలు గ్రూప్లో పెట్టడంతో మానవత వాదులు, యువకులు పెద్దలు తమకు తోచినంత సహాయం చేస్తున్నారు.  మీరు కూడా మీ చేతనైనంత ఆర్థిక సాయం చేసి సురేఖ ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించాలని ఆ కన్నతల్లి వేడుకుంటోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News