హైదరాబాద్ లోని హయత్ నగర్లో దారుణ ఘటన వెలుగుచూసింది. చక్కగా చదువుకోవాల్సిన హైస్కూల్ విద్యార్థులు టెన్త్ విద్యార్థినిపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. తాము చేసేది పెద్ద ఘనకార్యమన్నట్టుగా ప్రతిసారి వీడియోలు తీసి.. తమ తోటి విద్యార్థులకు పంపించారు. గడ్డి అన్నారంలోని వైఎస్సార్ కాలనీలో ఉంటున్న విద్యార్థిని ఇంట్లోకి ఐదుగురు విద్యార్థులు చొరబడి అత్యాచారం చేశారు. ఆ సమయంలో విద్యార్థినీ ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఈ దారుణం జరిగింది.
దానిని వీడియో తీసి.. ఎవరికైనా చెబితే సోషల్ మీడియాలో పెడతామని బెదిరించారు. 10 రోజుల తర్వాత ఆ వీడియో చూపి..మళ్లీ అత్యాచారానికి ఒడిగట్టారు. మళ్లీ వీడియో తీసి తమ తోటి విద్యార్థులకు పంపారు. విషయం తల్లిదండ్రులకు తెలియడంతో.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు పోలీసులు విద్యార్థులపై పోక్సోయాక్ట్ కింద కేసు నమోదు చేశారు.