రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సుఖోయ్ యుద్ధ విమానంలో ప్రయాణించారు. ప్రస్తుతం అస్సాం పర్యటనలో ఉన్న రాష్ట్రపతి ద్రౌపది తేజ్ పూర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుంచి సుఖోయ్-30లో ప్రయాణించారు. అరుణాచల్ ప్రదేశ్ పై చైనా కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో ఆమె సుఖోయ్ లో ప్రయాణిస్తుండటం విశేషం.