Tuesday, May 21, 2024
Homeచిత్ర ప్రభAllu Arjun: పుష్ప 2 లో బన్నీ రెమ్యునరేషన్ 85 కోట్లా!

Allu Arjun: పుష్ప 2 లో బన్నీ రెమ్యునరేషన్ 85 కోట్లా!

పుష్ప కోసం అల్లు అర్జున్ రెమ్యునరేషన్ విపరీతంగా పెంచేశారని టాలీవుడ్ లో గట్టిగా రూమర్స్ వినిపిస్తున్నాయి.  రూమర్స్ చెబుతున్న విషయాలు ఒకసారి వెంటే బన్నీ ఫ్యాన్స్ షాక్ తినటం ఖాయం.  పుష్ప కోసం 45 కోట్ల రెమ్యునరేష్ తీసుకున్న అల్లు అర్జున్ పుష్ప 2 కోసం ఏకంగా డబుల్ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారట.  అంటే పుష్ప ప్యాన్ ఇండియా రేంజ్ లో పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టి కోట్లు కొల్లగొట్టింది. ఈనేపథ్యంలో అల్లు అర్జున్ ఇమేజ్ ఒక్కసారిగా పూర్తిగా మారిపోయింది. 

- Advertisement -

డ్యాన్స్, డైలాగ్ డెలివరీ, బాడీ ట్రాన్స్ఫార్మేషన్ తో సహా బన్నీ 360 డిగ్రీస్ లో చూపించిన పుష్ప సినిమాతో బన్నీ రేంజ్ పూర్తిగా మారిపోయి తారాస్థాయికి చేరింది. దీంతో పుష్ప 2 సినిమాకున్న విపరీతమైన క్రేజ్ నేపథ్యంలో బన్నీ 85 కోట్ల పారితోషికం తీసుకుంటున్నట్టు సమాచారం. బన్నీ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ అయిన పుష్ప-2 టీజర్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండటంతో పుష్ప-2 కలెక్షన్ల వర్షం కురిపించటం ఖాయం అని ఫ్యాన్స్, ట్రేడ్ ఎక్స్ పర్ట్స్ అప్పుడే హైపింగ్ స్టార్ట్ చేసేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News