వివాదాస్పద వ్యాఖ్యలకు పెట్టింది పేరు అన్నంత పాపులర్ అయ్యారు బీజేపీ జనరల్ సెక్రెటరీ కైలాశ్ విజయవర్గీయ. తాజాగా ఆయన అమ్మాయిలు వేసుకునే ఆధునిక వస్త్రాలపై నోరుపారేసుకున్నారు. ప్రస్తుతం కైలశ్ మాటలు వైరల్ అవుతూ, మహిళా సంఘాలకు ఆయన మరోసారి టార్గెట్ అవుతున్నారు. దేవుడు అందమైన శరీరం ఇస్తే మహిళలు కొందరు డర్టీ బట్టలు వేసుకుంటూ సూర్పణఖల్లా కనిపిస్తున్నారని ఆయన మండిపడ్డారు. మహిళా వస్త్రధారణపై తాను చాలా ఆందోళన చెందుతున్నట్టు వివరించిన ఆయన, మీ పిల్లలకు సరైన వస్త్రధారణపై అవగాహన కలిగించాలంటూ పేరెంట్స్ కు క్లాస్ పీకారు. ఇలా వెస్ట్రన్ వేర్ లో ఉన్న మహిళలను ఆయన రాక్షసులతో పోల్చటంపై వివాదం రాజుకుంది.
ఇండోర్ నగరంలో జరిగిన హనుమజ్జయంతి వేడుకల్లో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేయటంపై మహిళా లోకం భగ్గుమంటోంది. చూడాలి మరి ఎన్నికల వేళ బీజేపీ, బీజేపీ సీనియర్ నేత-కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ వంటివారు ఈ వ్యాఖ్యలపై ఎలా స్పందిస్తారో అంటూ ప్రతిపక్షాలు నిప్పులు చెరుగుతున్నాయి.