ఘట్కేసర్ చౌరస్తాలో బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ భారీ విగ్రహావిష్కరణ సభలో రాష్ట్ర మంత్రులు డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. మంత్రి చామకూర మల్లారెడ్డి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ గౌడ్, రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్ గౌడ సంఘాల ఆధ్వర్యంలో ఔటర్ రింగ్ రోడ్డు చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి భారీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఘట్కేసర్ చౌరస్తాను సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చౌరస్తాగా నామకరణం చేశారు.
ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి ఆశయాలను, గౌడ్ల సంక్షేమాన్ని దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా కొనసాగిస్తున్నారన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పీడత వర్గాలకు అండగా నిలిచిన గొప్ప చక్రవర్తి అనీ అభివర్ణించారు. ఆసియా ఖండంలోనే బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చరిత్రను కేంబ్రిడ్జి యూనివర్సిటీలో అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం భద్రపరచిందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గీత వృత్తిని ప్రోత్సహించేందుకు హరితహారం లో భాగంగా తాటి, ఈత మొక్కలను నాటామన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో గత పాలకులు హైదరాబాదులో కల్లు దుకాణాలను బంద్ చేశారన్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రo ఏర్పడిన తర్వాత కల్లు దుకాణాలను పునరుద్ధరించి గీత కార్మికుల ఆత్మ గౌరవం నింపారన్నారు. తాటి ఈత చెట్ల పన్నును రద్దు చేశారన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వర్ధంతి లను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరుగుతున్నామన్నారు. ట్యాంక్ బండ్ పై సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా నీరా పాలసీని ప్రవేశపెట్టారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో నీరాను గౌడ కులస్తులు మాత్రమే గీసుకునేలా, అమ్ముకునేలా ప్రత్యేక జీవోను తీసుకొచ్చిన ఘనత సీఎం కేసీఆర్ కి దక్కిందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కులవృత్తులకు పూర్వ వైభవాన్ని తీసుకోస్తుందన్నరు. రైతులు, బలహీన వర్గాలకు, కుల వృత్తులకు తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ అండగా నిరుస్తున్నారన్నారు. రాష్ట్రంలో గౌడ కులస్తులకు కల్లు, నీరా తో పాటు వైన్ షాప్, బార్ షాపులను కూడా సీఎం కేసీఆర్ గారు గౌడ్లకు రిజర్వేషన్లు కేటాయించారన్నారు. గతంలో గౌడ కులస్తులపై అనేక అక్రమ కేసులు పెట్టి వేధించేవారున్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌడ్లు స్వేచ్ఛగా కల్లు వ్యాపారం చేసుకుంటున్నారన్నారు. గౌడ కులస్తులు ఆర్థికంగా ఎదిగేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. గౌడ్లు ఇతర కులస్తులలో ఉన్న పేదలకు సహాయపడాలనీ రాష్ట్ర మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. గౌడ్లు సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు. ప్రజల్లో మంచి పేరు సంపాదించుకోవాలని కోరారు. రాష్ట్రంలో గౌడ సంక్షేమంలో భాగంగా 62,000 వేల మంది గీత కార్మికులకు పెన్షన్లను అందిస్తున్నామన్నారు. సీఎం కేసీఆర్ గారు బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాలు ఎదిగేందుకు గురుకులాలను స్థాపించారన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు సుధీర్ రెడ్డి, నక్క ప్రభాకర్ గౌడ్ , గౌడ సంఘాల రాష్ట్ర ప్రతినిధులు పల్లె లక్ష్మణ రావు గౌడ్, బాలగోని బాలరాజ్ గౌడ్, అయిలి వెంకన్న గౌడ్, ఎలికట్టే విజయ్ కుమార్ గౌడ్, జైహింద్ గౌడ్, అంబాల నారాయణ గౌడ్, ప్రశాంత్ గౌడ్, రాజయ్య గౌడ్, వేములయ్య గౌడ్, సారా శ్రీనివాస్ గౌడ్, సురేష్ గౌడ్, బింగి శ్రీనివాస్ గౌడ్, లక్ష్మీ ప్రసన్న గౌడ్, శ్రవణ్ గౌడ్, బండారి శ్రీనివాస్ గౌడ్, తదితర గౌడ సంఘాల ప్రతినిధులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, గౌడ సంఘాల ప్రతినిధులు,BRS పార్టీ నాయకులు పాల్గొన్నారు.