Saturday, November 23, 2024
Homeఆంధ్రప్రదేశ్Allagadda: స్టిక్కర్లు అంటించుకుంటే అభివృద్ధి కనిపిస్తుందా?

Allagadda: స్టిక్కర్లు అంటించుకుంటే అభివృద్ధి కనిపిస్తుందా?

స్టిక్కర్లు అంటించుకుంటే అభివృద్ధి కనిపిస్తుందా అంటూ మాజీ మంత్రి టీడీపీ నేత భూమా అఖిలప్రియ విమర్శించారు.  శిరివెళ్ల మండల కేంద్రంలోని పలు వార్డులలో వరుసగా మూడో రోజు రాష్ట్రానికి ఇదేం ఖర్మ కార్యక్రమంలో రాష్ట్ర టిడిపి ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, టిడిపి కన్వీనర్ కాటంరెడ్డి శ్రీకాంత్ రెడ్డి ,మాజీ జెడ్పిటిసి యామా గురప్పలతో కలిసి పాల్గొన్నారు.

- Advertisement -

ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, ప్రజా సమస్యలను వెలికి తీస్తూ మాజీ మంత్రి అఖిలప్రియ ఉత్సాహంగా వార్డులలో కలియ తిరిగారు. 13వ వార్డు మరియు బీసీ కాలనీలలో ఆమె ఇంటింటికి తిరుగుతూ ప్రజా సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన వారు తమ జేబులు నింపుకోవడం తప్ప ప్రజా సమస్యలు పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శించారు. కనీసం కుళాయిలు, డ్రైనేజీ కాలువలు, ప్రధాన వీధులలో పరిసరాలు శుభ్రతను, వీధి లైట్లను సైతం వేయించలేని స్థితిలో నేటి పాలకులు ఉన్నారని ఘాటుగా విమర్శించారు.  రాష్ట్రంలో చట్ట వ్యతిరేక కార్యక్రమాలు అధికమయ్యాయని, మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, గుట్కా గంజాయి చీప్ లిక్కర్లు మాఫియా అధికమై యువత ఆత్మహత్యల వైపు చూస్తున్నారని భూమా అఖిలప్రియ అన్నారు.

స్టిక్కర్లు అంటించుకుంటే అభివృద్ధి కనిపించదని, అభివృద్ధి చేస్తే ప్రజలే గుండెల్లో దాచుకుంటారన్నారు.  ఈ కార్యక్రమంలో పసుల రామకృష్ణ ,పి పి లింగమయ్య టిడిపి సర్పంచులు ఎంపీటీసీలు వార్డ్ మెంబర్లు టిడిపి ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News