NAC 14వ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ డెవలప్‌మెంట్ కౌన్సిల్ (న్యూఢిల్లీ) విశ్వకర్మ అవార్డు “నిర్మాణ నైపుణ్య అభివృద్ధికి అచీవ్‌మెంట్ అవార్డు”ను గెలుచుకుంది. ఈ అవార్డును NAC డైరెక్టర్లు న్యూఢిల్లీలో ICAR కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో పార్లమెంటరీ వ్యవహారాలు & సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి శ్రీ అర్జున్ రామ్ మేఘవాల్ ఈ అవార్డును ప్రదానం చేశారు.
న్యాక్ కు “నిర్మాణ నైపుణ్య అభివృద్ధి అచీవ్‌మెంట్” విభాగంలో ప్రతిష్టాత్మక విశ్వకర్మ అవార్డు రావడం పట్ల న్యాక్ వైస్ చైర్మన్,రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
NAC గత సంవత్సరంలో 21,240 మంది వ్యక్తులకు నిర్మాణ సంబంధిత శిక్షణా కార్యక్రమాలను నిర్వహించి, వారిలో చాలా మంది యువతను ప్రైవేట్ పరిశ్రమలో విజయవంతంగా ఉపాధి అవకాశాలు కల్పించినందుకు గాను 2023 సంవత్సరానికి భారతదేశంలోనే ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్న ఏకైక నైపుణ్యాన్యాభివృద్ధి సంస్థ NAC అని కొనియాడారు. ఈ ప్రతిష్టాత్మక అవార్డును NAC సంస్థ అందుకోవడం గర్వించదగ్గ విషయం అని మంత్రి అన్నారు. ముఖ్యమంత్రి కెసీఆర్ గారి మార్గ నిర్దేశనంలో.. స్కిల్ డెవలప్మెంట్ పెంచి యువతకు ఉద్యోగ కల్పనకు కృషి చేసేందుకుగాను జిల్లాలకు NAC విస్తరిస్తోందని మంత్రి వెల్లడించారు.
అవార్డు రావడానికి కృషి చేసిన న్యాక్ డిజి కె.బిక్షపతి, డైరెక్టర్లకు మంత్రి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. న్యాక్ సంస్థ డైరెక్టర్లు M రాజిరెడ్డి, డైరెక్టర్, CTTI, I శాంతి శ్రీ, డైరెక్టర్, ప్లేస్మెంట్స్, హేమలత, డైరెక్టర్, ఫైనాన్స్ మరియు సత్యపాల్ రెడ్డి, డైరెక్టర్, HDI లు ఈ అవార్డును ఢిల్లీలో అందుకున్నారు.