Monday, May 19, 2025
Homeచిత్ర ప్రభBollywood: ఆ సినిమా డైరెక్ట్ చేస్తే 32 కోట్లు ఇస్తాం

Bollywood: ఆ సినిమా డైరెక్ట్ చేస్తే 32 కోట్లు ఇస్తాం

బిగ్గెస్ట్ యాక్షన్ ఫ్రాంచైజీ బ్రహ్మాస్త్ర సినిమా ఫ్లాప్ అయినా డబ్బులు మాత్రం బానే వచ్చాయి. దీంతో బ్రహ్మాస్త్ర డైరెక్టర్ అయాన్ ముఖర్జీకి వరుసపెట్టి ఆఫర్లు వస్తున్నాయి.  అది కూడా స్టార్స్ ను డైరెక్ట్ చేయమని ఇంకా వివరంగా చెప్పాలంటే స్టార్ కిడ్స్ ను డైరెక్ట్ చేయమనే ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి.  ఈనేపథ్యంలో హృతిక్ రోషన్ సినిమా వార్ కు సీక్వెల్ అయిన వార్ 2 సినిమా డైరెక్షన్ చేస్తే 32 కోట్లు ఇస్తామని అయాన్ కు ఆఫర్ చేశారు నిర్మాత.  దీంతో ఈ నెలాఖరుకు వార్ 2 సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను అయాన్ స్టార్ట్ చేస్తున్నారు. వచ్చే ఏడాది ఆఖరులో లేదా 2025 ఆరంభంలోకానీ వార్ 2 సినిమా రిలీజ్ అవ్వనుంది.

- Advertisement -

అయితే ప్రొడ్యూసర్ కరణ్ జోహర్ మాత్రం బ్రహ్మాస్త్ర సీక్వెల్ మొదట స్టార్ట్ చేశాకనే వార్ 2 పనులు స్టార్ట్ చేయమని అయాన్ కు చెబుతున్నారట. ఎందుకంటే అర్ధాంతరంగా ఇలా వార్ 2 కోసం బ్రహ్మాస్త్ర సిరీస్ ను అయాన్ వదిలేయటం కరణ్ కు ఏమాత్రం నచ్చలేదని సమాచారం. బ్రహ్మాస్త్ర కోసం ఎనిమిదేళ్లపాటు వందల కోట్లు ఖర్చు పెట్టిన కరణ్ ను వదిలి ఇలా వైఆర్ఎఫ్ పంచన అయాన్ జంప్ అవ్వటం కరణ్ కు అస్సలు నచ్చలేదు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News