స్కూల్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రెటరీ ప్రవీణ్ ప్రకాష్ పనితీరు తెలుగు రాష్ట్రాల్లో అందరికీ బాగా తెలుసు. మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్న ప్రవీణ్ ఏకంగా విద్యార్థి ఇంటికి వెళ్లి అసలు సర్కారు ఇచ్చిన షూస్ ఎందుకు వేసుకోలేదని, షూస్ వేసుకునే అలవాటు చేసుకోవాలని మరీ చెప్పారు. అంతకుముందు ప్రకాశం జిల్లాలోని మార్కాపూర్ మండలం వేములకోట జిల్లా పరిషద్ హై స్కూల్ సందర్శించిన ఆయన అసలు జగనన్న విద్య కానుక కింద విద్యార్థులకు పంపిణీ చేసిన షూస్ ఎందుకు వేసుకోవటం లేదని విచారించారు. రోజూ విద్యార్థులు షూస్ వేసుకుంటున్నారో లేదో పరిశీలించాలని ఆయన టీచర్లను ఆదేశించారు. లైఫ్ స్టైల్ లో భాగంగా షూస్ ధరించాలని విద్యార్థుల ఇంటికి వెళ్లి మరీ చెప్పారు ప్రవీణ్ ప్రకాష్.
Praveen Prakash: షూ ఎందుకు వేసుకోవటం లేదని విద్యార్థుల ఇంటికే వెళ్లిన ప్రవీణ్ ప్రకాష్
సంబంధిత వార్తలు | RELATED ARTICLES