Saturday, October 5, 2024
Homeనేరాలు-ఘోరాలుHyd: 20 నిమిషాల్లో చైన్ స్నాచర్లను పట్టుకున్న పోలీసులకు రివార్డులు

Hyd: 20 నిమిషాల్లో చైన్ స్నాచర్లను పట్టుకున్న పోలీసులకు రివార్డులు

చైన్ స్నాచర్లను కేవలం 20 నిమిషాల్లో పట్టుకున్న జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్ సిబ్బందిని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ అభినందించారు. వివరాల్లోకి వెళ్తే స్టేషన్ పరిధిలోని కేకే వైన్స్, వెంకటగిరి ప్రాంతాల్లో చైన్స్ స్నాచింగ్ జరిగింది. సమాచారం అందిన వెంటనే డిఐ శ్రీనివాస్, ఎస్ఐ నర్సింగరావు, హోంగార్డు సురేష్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఘటన వివరాలను సేకరించి నిందితులు పారిపోయిన మార్గాన్ని గుర్తించారు. కేవలం 20 నిమిషాల వ్యవధిలో స్నాక్స్ అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 10 గ్రాముల బంగారు గొలుసు స్వాధీనం చేసుకున్నారు. విషయం తెలుసుకున్న సిపి ఆనంద్ డిఐ, ఎస్ఐ, హోంగార్డులను రివార్డులతో సత్కరించారు. వారికి అభినందన పత్రాలను అందజేశారు. అందుకుగానూ సిపికి పోలీసు సిబ్బంది ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News