తనకంటే 12 ఏళ్ల చిన్నవాడైన బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ తో సహజీవనం చేస్తున్న యాక్ట్రెస్ మలైకా అరోరా ప్రెగ్నెంట్ అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 49 ఏళ్ల వయసులో మలైకా తన రెండో బిడ్డను, అర్జున్ తో కలిసి మొదటి బిడ్డను కంటున్నట్టు తమ సన్నిహితులకు వీళ్లు అక్టోబర్ లోనే రివీల్ చేశారట. కానీ ఇదంతా ఫేక్ గాసిప్ అంటూ అర్జున్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం 20 ఏళ్ల కొడుకుకు మాజీ భర్త అర్బాజ్ ఖాన్ తో కలిసి కో పేరెంట్ గా ఉన్నారు మలైకా. అర్బాజ్ తో 19 ఏళ్ల మ్యారిటల్ లైఫ్ కు ఆమె గుడ్ బై చెప్పి, అర్జున్ తో లివ్ ఇన్ లోకి అడుగుపెట్టి హ్యాపీగా గడిపేస్తున్నారు. ఎప్పటికప్పుడు వీరిద్దరిపై బ్రేకప్, మ్యారేజ్ రూమర్స్ వస్తున్నా వీళ్లు మాత్రం వేటినీ కేర్ చేయరు. పైగా సోషల్ మీడియాలో కపుల్ గోల్స్ అంటూ ఒకటే సందడి చేస్తుంటారు. ఫిట్నెస్ ఫ్రీక్ అయిన మలైకా బోలెడన్ని టీవీ షోలతో బిజీగా సంపాదించేస్తున్నారు. ఇప్పుడు ఓటీటీలో కూడా ఈమె తన సత్తా చాటేందుకు రెడీ అయ్యారు. నాలుగేళ్ల క్రితం నుంచి వీళ్ల లవ్ స్టోరీ అఫిషియల్ గా సాగుతోందనే దానికంటే 2012లోనే ఇదంతా స్టార్ట్ అయిందని చెప్పటం కరెక్ట్ అని బాలీవుడ్ సెలబ్స్ చెబుతుంటారు.
Malaika Arjun expecting: పేరెంట్స్ కాబోతున్న లవ్ బర్డ్స్..ఫేక్ గాసిప్ అంటున్న హీరో
సంబంధిత వార్తలు | RELATED ARTICLES