కుటుంబాల మధ్య దూరమవుతున్న బంధాలు బంధుత్వాలు ప్రేమానురాగాలు తెలిపే బలగం సినిమా ప్రదర్శన దుద్ధాగు గ్రామంలో ప్రదర్శించారు. గ్రామాలలో పాత రోజుల్ని గుర్తుకు సురేందర్ అడ్వకేట్ రామకృష్ణ సహకారంతో చిత్రాన్ని ప్రదర్శించారు. ఈ ప్రదర్శనను పల్లె ప్రజలతో కలిసి వీక్షించేందుకు బలగం చిత్రం కథానాయకుడు సంజీవ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… పల్లె ప్రజల జీవనశైలిని పల్లె అందాలను తెలంగాణ సంప్రదాయాలను మనుషుల భావోద్వేగాలను కలగలిసిన బలగం చిత్రం పల్లె ప్రజలతో కలిసి చూడడం మరిచిపోలేను అన్నారు.
చిన్న చిన్న మనస్పర్దల కారణంగా కుటుంబాలు చిన్న బిన్నమైతున్నాయన్నారు. మనస్పర్ధలను పక్కకు పెట్టి కుటుంబాలు కలిసి మెలిసి జీవించాలనే ఉద్దేశంతోనే బలగం సినిమానీతి అన్నారు. కొంతమంది మహిళలు బాగోద్వేగానికి గురై కండతడి పెట్టారు. ఉమ్మడి కుటుంబంలోని ఆప్యాయతలు అనురాగాలు భావోద్వేగాలను అన్ని కలగలిసిన సినిమాను తెరకెక్కించిన డైరెక్టర్ వేణుకు అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ యువకులు ప్రజలు చిన్నా పెద్ద తేడాలేకుండా పాల్గొన్నారు.