Thursday, September 19, 2024
Homeఆంధ్రప్రదేశ్Yuvagala: బీసీలకు ప్రాధాన్యత టిడిపితోనే సాధ్యం

Yuvagala: బీసీలకు ప్రాధాన్యత టిడిపితోనే సాధ్యం

ఆనాడు కాంగ్రెస్ పార్టీ హయాంలో బీసీలు అధిక సంఖ్యలో ఉన్నప్పటికీ అగ్రవర్ణాలు పెత్తందారులు పెట్టుబడిదారుల కరసనల్లో బానిసత్వ జీవితాన్ని గడుపుతుంటే దివంగత నేత ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించి బీసీలకు అత్యంతగా ప్రాధాన్యత కలిగించిన ఘనత తెలుగుదేశం పార్టీకి దక్కిందని టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ఆదోని సమీపంలోని కడితోట గ్రామం నుంచి యువగళం పాదయాత్ర ప్రారంభించి గనేకల్లు, పాడేగల్లు జాలి బెంచి, కుప్పగల్లు, బల్లేకళ్ళు ఆయా గ్రామాల ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. పాడేగల్లు గ్రామంలో ప్రభుత్వ చెరువు ఆక్రమణకు గురైందని, అధికార పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు స్వాధీనం చేసుకుని తాగు, సాగు నీరు అందే విధంగా చర్యలు చేపడతామని ఇచ్చిన హామీని విస్మరించారని లోకేష్ దృష్టికి గ్రామ చెరువు సాధన సమితి ఆధ్వర్యంలో గ్రామ ప్రజలు తీసుకువెళ్లారు. ఆక్రమణలకు గురైన చెరువులను సందర్శించాలని లోకేష్ ను కోరగా ఒక్క గ్రామానికి చెందిన చెరువు కాబట్టి మన ప్రభుత్వం రాగానే పరిష్కరించి గ్రామానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

- Advertisement -

మధ్యాహ్నం కుప్పగల్లు గ్రామంలో బీసీలతో సమావేశం ఏర్పాటు చేశారు. టిడిపి ప్రభుత్వంలో స్థానిక ఎన్నికల్లో బీసీలకు 33% రిజర్వేషన్ కల్పించిన ఘనత తెలుగుదేశం పార్టీకి దక్కిందని చెప్పుకొచ్చారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బీసీలలో ఓటు బ్యాంకు గాను పలు అవసరాల కొద్ది వాడుకునేందుకే పూనుకున్నారని వ్యాఖ్యానించారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీసీలు కంకణం కట్టుకొని ఏకతాటితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తుచిత్తుగా ఓడించి తెలుగుదేశం పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. పాదయాత్ర కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్చార్జి మీనాక్షి నాయుడు, నియోజకవర్గ మాజీ ఇంచార్జి గుడిసె కృష్ణమ్మ, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ భాస్కర్ రెడ్డి, మాన్వి దేవేంద్రప్ప నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News