Friday, September 20, 2024
Homeనేషనల్Viral video : పెళ్లిలో ఎంబీఏ విద్యార్థి చేత ఎంగిలి ప్లేట్లు క‌డిగించారు.. ఎందుకంటే..?

Viral video : పెళ్లిలో ఎంబీఏ విద్యార్థి చేత ఎంగిలి ప్లేట్లు క‌డిగించారు.. ఎందుకంటే..?

Viral video : ఏదైన హోట‌ల్‌కు గానీ రెస్టారెంట్ గానీ వెళ్లి క‌డుపు నిండా తిన్న త‌రువాత బిల్లు కట్ట‌క‌పోతే ఏం చేస్తారు? తిన్న‌ది అరిగే వ‌ర‌కు అక్క‌డ హోట‌ల్‌లో ప‌ప్పు రుబ్బ‌డ‌మో లేదంటే ఎంగిలి పేట్లు కడ‌గ‌డం వంటి వాటిని మ‌న సినిమాల్లో చూస్తుంటాం. ఆ సీన్లు వ‌చ్చిన‌ప్పుడు పొట్ట చెక్క‌ల‌య్యేదాకా న‌వ్వుకుంటాం. అయితే.. ఇక్క‌డ ఓ వ్య‌క్తి మాత్రం పిల‌వ‌ని పెళ్లికి వెళ్లాడు. వంట‌కాలు బాగుండ‌డంతో వాటిని ఓ ప‌ట్టు ప‌ట్టాడు. మ‌రీ ఎలా క‌నుకున్నారో ఏమో గానీ అత‌డిని ప‌ట్టుకున్నారు. తిన్న‌ది మొత్తం అరిగేలా అత‌డిచేత ప్లేట్ల‌ను క‌డిగించారు. ఈ ఘ‌ట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో జ‌రిగింది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

- Advertisement -

జబల్‌పూర్‌కు చెందిన ఓ వ్య‌క్తి భోపాల్ వ‌చ్చి ఎంబీఏ చ‌దువుకుంటున్నాడు. ఇటీవ‌ల అత‌డు ఓ వివాహ వేడ‌క‌కు వెళ్లాడు. అయితే అత‌డిని ఎవ‌రూ ఆ పెళ్లికి పిల‌వ‌లేదు. అయిన‌ప్ప‌టికీ ఎంచ‌క్కా భోజ‌నాలు వ‌డ్డించే ద‌గ్గ‌ర‌కు వెళ్లి క‌డుపు నిండా తిన్నాడు. ఇక అక్క‌డి నుంచి వెళ్లిపోదాం అని అనుకుంటుండ‌గా.. ఎలా క‌నుకున్నారో తెలీదు గానీ అత‌డు పిల‌వ‌కుండానే వ‌చ్చాడని తెలుసుకున్నారు అక్క‌డి పెళ్లి పెద్ద‌లు.

అత‌డిని తిట్ట‌డంతో పాటు తిన్నందుకు ప్లేట్లు, పాత్ర‌లు మొత్తం క‌డిగి వెళ్లాల‌ని ఆదేశించారు. అంతేకాకుండా ద‌గ్గ‌రుండి మ‌రీ అత‌డిచేత ఆ ప‌ని చేయించారు. ఈ త‌తంగాన్ని మొత్తం వీడియో తీసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌గా వైర‌ల్‌గా మారింది. దీనిపై నెటీజ‌న్లు త‌మ‌దైన శైలిలో స్పందిస్తున్నారు. కొంద‌రు అత‌డిపై జాలి చూపిస్తుండ‌గా మ‌రికొంద‌రు మాత్రం అత‌డు చేసింది త‌ప్పేన‌ని అంటున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News