Friday, September 20, 2024
Homeనేరాలు-ఘోరాలుCI suspended: నారాయణగూడ సిఐ శ్రీనివాస్ రెడ్డి సస్పెండ్

CI suspended: నారాయణగూడ సిఐ శ్రీనివాస్ రెడ్డి సస్పెండ్

నారాయణగూడ పోలీస్ స్టేషన్ సిఐ శ్రీనివాస్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈమేరకు నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ఉత్తర్వులు జారీచేశారు. పోలీస్ స్టేషన్ పరిధిలో యథేచ్ఛగా నడుస్తున్న హుక్కా పార్లర్ లపై సిఐ చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తడంతో సీఐను సస్పెండ్ చేయక తప్పని ఒత్తిడి తలెత్తింది.

- Advertisement -

ఇటీవల టాస్క్ ఫోర్స్ రైడ్స్ లో తేటతెల్లం అయిన సిఐ వ్యవహారంతో సీపీ ఈ కఠిన చర్యలు తీసుకున్నారు. మొత్తానికి విధుల్లో నిర్లక్ష్యం వహిస్తుండటంతో సస్పెన్షన్ కు గురయ్యాడు సిఐ శ్రీనివాస్ రెడ్డి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News