Friday, September 20, 2024
Homeనేరాలు-ఘోరాలుHyd: బోరబండలో ప్రేమోన్మాది ఘాతుకం

Hyd: బోరబండలో ప్రేమోన్మాది ఘాతుకం

ఓ ప్రేమోన్మాది ప్రేమించిన ప్రియురాలి కళ్ళల్లో కారం చల్లి, కత్తితో గొంతు కోసిన ఘాతకం ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బోరబండ బంజారా నగర్ లో చోటుచేసుకుంది. ఎస్సార్ నగర్ పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బోరబండ మోతీ నగర్ చెందిన కిషోర్ (28) ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో పనిచేస్తున్నాడు. బోరబండ సైట్ వన్ కి చెందిన లక్ష్మి గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. ఇటీవల కాలంలో వారి మధ్య అనేక గొడవలు జరుగుతున్నాయి. కాగా సోమవారం లక్ష్మి తన తల్లితో కలిసి ఓ పనిపై బోరబండకు వెళ్లి వస్తుండగా బైక్ పై వెంబడించిన కిషోర్ బంజారా కాలనీ బడా గణేష్ వద్ద వారి వాహనంకి తన బైక్ ను అడ్డుపెట్టి తన వెంట తెచ్చుకున్న కారంపొడిని లక్ష్మీ ముఖంపై చల్లి కూరగాయల కత్తితో గొంతు కోశాడు. ఇదంతా గమనించిన అక్కడి స్థానిక ప్రజలు అప్రమత్తమై అతని అడ్డుకొని స్థానిక పోలీస్ స్టేషన్లో అప్పచెప్పారు. అనంతరం లక్ష్మిని చికిత్స నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్ కి తరలించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News