Thursday, September 19, 2024
Homeనేరాలు-ఘోరాలుKondapaka: సాగునీటి కోసం రోడ్డెక్కిన రైతులు

Kondapaka: సాగునీటి కోసం రోడ్డెక్కిన రైతులు

ముఖ్యమంత్రి నియోజకవర్గమైన గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపాక మండల పరిధిలోని బందారం. బంధారం దర్గా. అంకిరెడ్డిపల్లి గ్రామాలకు చెందిన రైతులు దుద్దెడ వేలికట్ట చౌరస్తాలలో వేరువేరుగా రాస్తారోకో నిర్వహించారు. ధర్నా చేస్తారని ముందస్తు సమాచారం పోలీసులకు నాయకులు చేరవేశారు. పోలీసులు రైతులు రోడ్డు ఎక్కకుండా బందారం సబ్ స్టేషన్ వద్ద పోలీసు వ్యాన్ తో భారీ పీకట్టింగ్ ఏర్పాటు చేశారు. పోలీసుల కల్లూకప్పి రైతులు దుద్దేడకు చేరుకొని రోడ్డుపై బైఠాయించారు. విషయం తెలుసుకున్న పోలీసులు దుద్దేడకు చేరుకొని రైతులను అరెస్టు చేసి త్రీటౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఆలస్యంగా చేరుకున్న కొంతమంది రైతులు రైతులను అరెస్టును నిరసిస్తూ కుక్కునూరు పెళ్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని చేర్యాల చౌరస్తా వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపి పోలీసులకు సవాల్ విసిరారు. ధర్నా చేస్తున్నారన్న విషయం తెలుసుకున్న త్రీ టౌన్ పోలీసులు ఆగమేఘాలమీద చేర్యాల చౌరస్తాకు చేరుకొని ధర్నా చేస్తున్న రైతులనుఅరెస్టుచేసి కుకునూరుపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ గత 8 సంవత్సరాల నుండి తపాస్పల్లి రిజర్వాయర్ నుండి నీరు అందిస్తామని ప్రభుత్వం హామీ ఇస్తూ ఎన్నికల సమయంలో ప్రజలను మభ్యపెడుతూ ఎన్నికల అనంతరం హామీని గాలికి వదిలేసారు అన్నారు. తపాస్పెల్లి నుంచి మర్పడగ వరకు కాలువనుతవ్వివదిలేశారని ఆరోపించారు. గత మూడు సంవత్సరాల క్రితం కాలువ పనులు ప్రారంభించినప్పటికీ అక్కడే ఆగిపోయే తప్ప ముందుకు సాగడం లేదు. కొండపాక మండలంలో నిర్మించిన మల్లన్న సాగర్ నుండి నీటిని అందిస్తామని నాయకులు ఎన్నోసార్లు రైతులకు చెప్పారు. అయినా ఇప్పటివరకు కాలువ నిర్మాణం పనులు ప్రారంభించడం లేదు .బందారం చుట్టుపక్కల గ్రామాలకు సాగునీరు అందిస్తున్నప్పటికీ ముఖ్యమంత్రి నియోజకవర్గంలోని మూడు గ్రామాలకు నీరు అందించకపోవడం ఏంటని పలువురు ప్రశ్నించారు. ఈరోజు ఉదయం ధర్నా నిర్వహించాలని పలువురు రైతులు నాయకులను కోరారు. ధర్నా చేస్తామని అందరూ తరలిరావాలని పిలుపునిచ్చారు. టిఆర్ఎస్ జండా ఆవిష్కరించి గజ్వేల్ సభకు తరలడానికి నాయకులు ప్రయత్నించారు. ధర్నా చేయకుండా సభకు పోవడమేంటని పలువురు రైతులు నాయకులు నిలదీసినప్పటికీ నాయకులు ధర్నాకు తరలి వెళ్లారు. అనంతరం రైతులు దుద్దెడ గ్రామంలో ధర్నా నిర్వహించిన అనంతరం వెలుకట్ట చౌరస్తా వద్ద రెండోసారి ధర్నా నిర్వహించి పోలీసులకే సవాల్ విసిరారు

- Advertisement -

రాజీనామా చేయడానికి సిద్ధం అంకిరెడ్డిపల్లి సర్పంచ్..

ఈ నియోజకవర్గం నుండి అంకిరెడ్డిపల్లి. బంధారం. దర్గా గ్రామాల నుండి ముఖ్యమంత్రి కేసీఆర్ కు భారీ మెజార్టీని అందించి రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నామని ఏ ఎన్నికలలో పిలుపునిచ్చిన ముందుండి ఓట్లు వేయించామని అంకిరెడ్డిపల్లి మాజీ సర్పంచ్ ప్రస్తుత సర్పంచ్ భర్తబడెకోల్ నర్సింలుఅన్నారు. రైతుల కోసం కాకుంటే ఇంకెవరి కోసం పని చేస్తారని సాగునారు అందించడానికి ఇంత సమయం ఏంటని ప్రశ్నించారు. నాయకులు ఎప్పుడు రైతుల వెంబడి ఉంటారని నేను రైతు ల వెంబడే ఉంటానని రైతుల ధర్నాకు మద్దతు ప్రకటించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News