Friday, November 22, 2024
Homeహెల్త్Gym@home: ఇంటి వ్యాయామాలతో ఇలా బరవు తగ్గొచ్చు

Gym@home: ఇంటి వ్యాయామాలతో ఇలా బరవు తగ్గొచ్చు

జాక్స్, క్రంచెస్, హిప్ మూవ్మెంట్స్ తో ఇంట్లో వ్యాయామాలు చేయడం మొదలెట్టవచ్చు కానీ వీటిని ప్రారంభంలోనే ఎక్విప్ మెంట్ తో చేయనవసరం లేదని ఫిట్ నెస్ నిపుణులు చెప్తున్నారు. అడ్వాన్స్ డు లెవెల్ వ్యాయామాలు చేసేటప్పుడు మాత్రం రెసిస్టెన్స్ బ్యాండ్స్, బరువులు వంటివాటితో వ్యాయామాలు చేయొచ్చు. తెల్లారకట్టే వ్యాయామాలు చేస్తే చాలా మంచిదని కూడా ఈ సందర్భంగా ఫిట్ నెస్ నిపుణులు చెప్తున్నారు. వ్యక్తుల శారీరక బలాన్ని బట్టి అరగంట నుంచి గంట సమయం వరకూ వ్యాయామాలు చేయవచ్చు.
 ఇంట్లోనే వ్యాయామాలు చేసినా కండరాల నొప్పులు మనల్ని పీడిస్తాయి. అందుకే వ్యాయామాలు చేయడానికి ముందు, తర్వాత వామప్, కూల్ డౌన్ వ్యాయామాలు చేయాలి. వీటిని చేయడం వేగవంతమైన కదలికలతో కూడిన వ్యాయామాలు బాగా చేయగలరు. కండరాలు నొప్పులు పెడుతుంటే వర్కవుట్లు అయిన తర్వాత ఐస్ ప్యాకు పెట్టుకోవాలి. కండరాల సలుపులకు ఐస్ బాత్ లు బాగా పనిచేస్తాయి. దీనితో పాటు తగినంత విశ్రాంతి, సరైన భంగిమలతో నిద్ర వంటివి చాలాముఖ్యమని మరవొద్దు.

- Advertisement -

 ఇంటి దగ్గర వ్యాయామాలు చేసేటప్పుడు కొన్ని దురభిప్రాయాలు వింటుంటాం. బరువు తగ్గే ప్రయత్నంలో ఫిట్ గా ఉండాలన్నది ప్రధాన ఉద్దేశమైనా కొంతమంది అతిగా వ్యాయామాలు చేస్తూ శరీరాన్ని తీవ్ర శ్రమకు గురిచేస్తుంటారు. పైగా బరువు తగ్గడానికి తాము చేస్తున్న పద్ధతి కరక్టు అని కూడా ఇలాంటి వాళ్లు భావిస్తుంటారు. వ్యాయామాలు తీవ్రంగా చేయడం వల్ల తొందరగా బరువు తగ్గుతామని నమ్ముతుంటారు కూడా. కానీ ఇది పూర్తిగా తప్పుడు అభిప్రాయమని ఫిట్నెస్ నిపుణులు చెప్తున్నారు. వ్యాయామాలను ఒక నిర్దిష్ట విధానంలో చేస్తే బరువు ఒక క్రమపద్ధతిలో మెల్లగా తగ్గుతుందని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా బలవర్ధకమైన జీవక్రియ వల్ల బరువు తరుగుదల సాధ్యమవుతుందని అంటున్నారు. అతి ఆహారం వల్ల జీవక్రియ వేగం తగ్గుతుందని చెపుతున్నారు.
 జీవనశైలిలో తగిన మార్పులు చేపట్టడం ద్వారా కూడా బరవు తగ్గుతారని ఆరోగ్యనిపుణులు చెప్తున్నారు. నిత్యం ఏడెనిమిది గంటలు నిద్రపోవడం, నీళ్లు బాగా తాగడం, పోషకాలతో కూడిన బలవర్థకమైన బ్రేక్ ఫాస్ట్ తీసుకోవడం, ఉదయపు సూర్యరశ్మికి ఫోకస్ అవడం, రోజుకు నాలుగుసార్లు చిన్న మొత్తాల్లో ఆహారం తినడం వంటి అలవాట్లను నిత్య జీవనంలో క్రమశిక్షణతో పాటించడం వల్ల కూడా బరువు తగ్గుతారు.
 వ్యాయామాలు చేయకుండా బరువు తగ్గడానికి కొన్ని ప్రత్యామ్నాయాలు కూడా ఉన్నాయి. బ్రిస్క్ వాకింగ్, స్విమ్మింగ్, సైక్లింగ్, శ్వాస వ్యాయామాలను నిత్యం చేస్తే కూడా బరువు తగ్గుతారు.
 నిత్యం వ్యాయామాలు చేసినంత మాత్రాన బరువు తగ్గరు. వ్యాయామాలకు తగిన ఆరోగ్యకరమైన డైట్ కూడా తీసుకోవాలి. ఇంట్లో వర్కవుట్స్ చేసేటప్పుడు మీరు ఎలాంటి వర్కవుట్ రెజీమ్ చేస్తున్నారో దానికి తగిన నాణ్యమైన ఆహారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. మీ వ్యాయామాలు తీవ్రమైనవి అయినట్టయితే మీరు తీసుకునే ఆహారంలో ప్రొటీన్లు, కాలరీలు బాగా అందించే ఫుడ్ అవసరం.
 ప్రొఫెషనల్ తోడ్పాటు లేకుండా ఇంట్లోనే బరువుతగ్గే పనిలో ఉన్నవాళ్లు వాళ్లు తీసుకునే ఆహారంపై కూడా ద్రుష్టిపెట్టాలి. ప్రోసెస్డ్ ఫుడ్స్ తక్కువగా తినాలి. షుగర్స్ బాగా తక్కువ తీసుకోవాలి. చాలామంది వర్కవుట్ల తర్వాత ఎనర్జిటిక్ గా ఉండలేకపోతున్నామని, బాగా అలసటగా ఉంటోందని ఫిర్యాదు చేస్తుంటారు. వీళ్లు ఎనర్జీ రావడానికి ఎక్కువ ప్రొటీన్లు, ఆరోగ్యకరమైన గుడ్ ఫ్యాట్స్ ఉన్న ఫుడ్ ను తీసుకోవాలి. నిమ్మనీళ్లు వంటి ఎలక్ట్రలైట్లు తీసుకుంటూ శరీరాన్ని ఎప్పుడూ హైడ్రేటెడ్ గా ఉండేలా చూసుకోవాలి. అంతేకాదు వర్కవుట్లు చేయడానికి అరగంట ముందు నిమ్మకాయ నీళ్లు తాగడం వల్ల శరీరం
వేగంగా ఎనర్జిటిక్ గా అవుతుందని పోషకాహార నిపుణులు చెప్తున్నారు.
 ఆరోగ్యకరమైన ఆహారం అంటే నెయ్యి, పప్పులు, నట్స్, ఆయిల్ సీడ్స్, ఉడకబెట్టిన కాయగూరలు, ఆకుకూరలు, లీన్ ప్రొటీన్లు, గుడ్లు, అవిసగింజలు, మొలకలు వంటివి తినాలి. తినకూడని పదార్థాల విషయానికి వస్తే షుగర్స్ ఉండే ప్యాక్డ్ ఫుడ్స్ జోలికి వెళ్లకూడదు. అలాగే నూనెలో బాగా వేగించిన పదార్థాలు తినకూడదు. రిఫైన్డ్ వెజిటబుల్ ఆయిల్స్ వాడొద్దు. సోడా వంటి వాటిని తాగొద్దు. అలాగే పగటి వేళలో ఆకలివేయడం సహజం. అలాంటప్పుడు చిరుతిళ్లు తినడానికి బదులు నానబెట్టిన నట్స్, గుమ్మడిగింజలు, అవిసెలు, మఖనాస్ వంటివి తినాలి.
 నిత్యం వ్యాయామాలు చేయడం వల్ల వెయిట్ మేనేజ్ మెంట్ బాగా అవుతుంది. శరీరారోగ్యానికి కూడా వ్యాయామలు ఎంతో మంచిది. రోజూ వర్కవుట్లు చేస్తున్నారు కాబట్టి ఏవి తినాలనుకుంటే వాటిని తినొచ్చు అని భావిస్తే మాత్రం మీరు పొరబడ్డారన్నమాటే. కాలరీలు పెరగడం, వాటిని కరిగించడం రెండూ రెండు విభిన్న విషయాలని మరవొద్దు. వ్యాయామాలు కాలరీలను కరిగిస్తాయి. మీ జీవక్రియను ఎంతో మెరుగుపరుస్తాయి. కానీ మీరు కరిగించే కాలరీల కన్నా తీసుకునే కాలరీలు ఎక్కువగా ఉంటే కూడా శరీర బరవు పెరుగుతారు.
 అలాగే ముందే చెప్పినట్టు మీరు ఎలాంటి ఆహారం తీసుకుంటున్నారన్నది కూడా బరవు తగ్గడంలో ఎంతో ప్రాధాన్యం సంతరిచుంకుంటుందని మరవొద్దు. ప్రోసెస్డ్, శాచ్యురేటెడ్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల మీరు రోజూ వ్యాయామం చేసినా ఎలాంటి ఫలితం ఉండదు. బరువు తగ్గరు. పైగా ఇలా చేయడం వల్ల ఆరోగ్యం సైతం దెబ్బతింటుంది. క్రానిక్ జబ్బులు తలెత్తుతాయి. ముఖ్యంగా మీరు తినేటప్పుడు మీ శరీరం ఏం చెపుతోందో గమనించండి. మీకు ఆకలి తీరిందని, కడుపు నిండిందని అనిపించిన క్షణంలో తినడానికి ఫుల్ స్టాప్ పెట్టడం మంచిది. ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, వెయిట్ మేనేజ్ మెంటుకు మీ శరీరానికి కావలసినది సమతుల్యమైన, పోషకాలతో కూడిన డైట్ అవసరం. ఆ డైట్ కు రెగ్యులర్ వ్యాయామాలు కూడా తప్పనిసరిగా జతకూడాలి. ఇవిపాటిస్తే బరువు తగ్గుతారు. మంచి ఫిట్ నెస్ తో ఉంటారు. అప్పుడు ఆరోగ్యమైన శరీరం మీ సొంతమవుతుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News