Friday, September 20, 2024
Homeచిత్ర ప్రభRam Charan : మరో అవార్డు అందుకోబోతున్న మెగా పవర్ స్టార్..

Ram Charan : మరో అవార్డు అందుకోబోతున్న మెగా పవర్ స్టార్..

- Advertisement -

Ram Charan : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ RRR సినిమా తర్వాత మరింత పాపులర్ అయ్యారు. దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. నార్త్ సైడ్ అయితే చరణ్ కి ఫుల్ క్రేజ్ ఏర్పడింది. ఇక RRR సినిమాతో ఇప్పటికే పలు అవార్డులు, రివార్డులు అందుకుంటున్నారు చరణ్. ఇటీవలే అక్షయ్ కుమార్ తో కలిసి ఓ ప్రముఖ ఛానల్ ప్రోగ్రాంకి అతిధిగా కూడా వెళ్లారు.

తాజాగా చరణ్ కి ఫ్యూచర్ అఫ్ యంగ్ ఇండియా అనే అవార్డు వరించింది. ప్రముఖ నేషనల్ మీడియా అయిన NDTV ట్రూ లెజెండ్స్ అనే ఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమంలో ఒక్కో కేటగిరిలో ఒక్కొక్కరికి ఫ్యూచర్ అఫ్ యంగ్ ఇండియా అనే అవార్డుని ఇస్తున్నారు.

సినిమా రంగంలో ఈ ఫ్యూచర్ అఫ్ యంగ్ ఇండియా అవార్డు చరణ్ కి దక్కింది. దీంతో ఈ అవార్డు అందుకోవడానికి చరణ్ నేడు ఢిల్లీ వెళ్లారు. దీంతో చరణ్, మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News