మందమర్రి మండలంలో ఐకేపీ వీవోఏ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఐకేపీ వీవోఏలు చేస్తున్న నిరవధిక సమ్మెకు సంగిభావంగా సమ్మె శిబిరాన్ని సందర్శించిన ఐకేపీ వీవోఏ జిల్లా గౌరవ అధ్యక్షులు దుంపల రంజిత్ కుమార్ హాజరై మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత నుండి నేటి వరకు గ్రామాల్లోని మహిళలకు స్వయం ఉపాధి కోసం, బ్యాంకు రుణాలు ఇప్పిస్తూ, వారిని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న వీవోఏలను ప్రభుత్వం పట్టించుకోకపోవడం చాలా దారుణం. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పందించి, వీవోఏలను సెర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించాలి. కనీస వేతనం 26 వేలు ఇవ్వాలి, ప్రమాద భీమా సౌకర్యం రూ,10 లక్షలు చెల్లించాలి, అర్హులైన వీవోఏలను cc లుగా ప్రమోట్ చేయాలి, లేకుంటే రాబోయే రోజుల్లో వీవోఏలు చేసే పోరాటానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి వెంకటేష్, జిల్లా సలహా దారులు తుకారాం, వనజ మండల అధ్యక్షులు, కార్యదర్శి, కోశాధికారి మరియు మండల వీవోఏలు తదితరులు పాల్గొన్నారు.