ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ విడుదల చేసిన వాతావరణ అప్డేట్ ఇలా ఉంది.
ఐఎండి అంచనా ప్రకారం మాల్దీవుల నుండి మధ్యమహారాష్ట్ర వరకు కర్ణాటక మీదుగా సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ద్రోణి కొనసాగుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.బి.ఆర్ అంబేద్కర్ తెలిపారు. దీని ప్రభావంతో రాష్ట్రంలో రానున్న నాలుగు రోజులు పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడేప్పుడు చెట్లుక్రింద నిలబడవద్దని విజ్ఞప్తి చేశారు.ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అదేవిధంగా ఎండ తీవ్రత రాష్ట్రంలో స్వల్పంగా తగ్గనున్నట్లు తెలిపారు.
రానున్న నాలుగు రోజుల వాతావరణ వివరాలు :
శనివారం:- ఉత్తరాంధ్ర,గుంటూరు, పల్నాడు,బాపట్ల, ప్రకాశం,అనంతపురం, కర్నూల్, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది.
ఆదివారం,సోమవారం:- రాయలసీమలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగిలిన చోట్ల అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉంది.
మంగళవారం :- రాయలసీమలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది.