Sunday, October 6, 2024
Homeఆంధ్రప్రదేశ్Lokesh: బోర్లకు విద్యుత్ మీటర్లు బిగిస్తే పగలగొట్టండి

Lokesh: బోర్లకు విద్యుత్ మీటర్లు బిగిస్తే పగలగొట్టండి

వైసిపి ప్రభుత్వం రైతుల పంట బోర్లకు విద్యుత్ మీటర్లు బిగిస్తే పగలగొట్టండి ఆ తరువాత మీకు మేము అండగా ఉంటామని టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్ పిలుపునిచ్చారు. ఎమ్మిగనూరు నియోజకవర్గం లో నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. నందవరం మండలం ఇబ్రహీంపురం గ్రామ సమీపంలో టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర అధ్వర్యంలో లోకేష్ స్వాగతం పలికారు. అక్కడ నుండి వస్తూ మిరప కాయలు ఆరబోసిన కల్లం వద్దకు వెళ్లి రైతులను కలుసుకొని వారి సమస్యలను తెలుసుకున్నారు. కొట్టాల మీదుగా మాచాపురం కు చేరుకొని అక్కడ ఏర్పాటు చేసిన రైతుల ముఖా ముఖి కార్యక్రమంలో లోకేష్ పాల్గొన్నారు. మాచాపురం నుండి నందవరం ముత్తన్న టాకీస్ వరకు పాదయాత్ర సాగింది . అంతకముందు రైతు ముఖా ముఖిలో రైతులు పలు సమస్యలను లోకేష్ కు తెలిపారు. గోనెగండ్ల మండలం నెరుడుప్పల గ్రామానికి చెందిన కౌలు రైతు రంగమ్మ మాట్లాడారు.తమ భర్త అప్పు బాధతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పంటలు లేక గిట్టుబాటు ధర లేక అప్పుల బాధ భరించలేక హైదరాబాద్ వేలు చెత్త పేపర్లు ఏరుకుంటూ దుర్బర జీవితం గడుపుతున్న తమ ను ఆదుకోవాలని వేసుకొని కన్నీరు పెట్టుకుంది.ఇందుకు చలించిపోయిన లోకేష్ బాధిత రంగమ్మ కుటుంబానికి 1 లక్ష రూపాయలు పరిహారాన్ని అందించారు.ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ మోటర్లు కు మీటర్లు బిగిస్తే రైతులకు ఉరి తాడే దిక్కు అవుతుంది.కల్తీ విత్తనాలు తయారు చేసే కంపెనీలపై పిడి యాక్ట్ పెట్టి వారి నుండే నష్ట పరిహారం ఇప్పిస్తాం. వైసిపి వచ్చాక రాయలసీమ లో ఒక్క సాగు నీటి ప్రాజెక్టు కట్టలేదు.మేము అధికారంలోకి వచ్చిన వెంటనే పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి ప్రతి ఎకరాకు నీరు ఇచ్చి సురక్షిత త్రాగు ఇస్తాం. చంద్ర బాబు హయాంలో రాయలసీమ ప్రాజెక్టుల కోసం 11 వేల కోట్లు ఖర్చు చేయడం జరిగింది. చేతకాని దద్దమ్మ వ్యవసాయ శాఖ మంత్రి అనాడైన రైతుల వద్దకు వచ్చి సమస్యలు తెలుసుకున్నాడా? వ్యవసాయ మంత్రి తో పాటు జగన్, అవినాష్ రెడ్డిలు చెంచల్ గూడ జైల్ కు వెళ్ళడం ఖాయం. వీరిద్దరూ కలసి ఏ జైల్ అయితే బాగుంటుందని చర్చించుకుంటున్నారు. గురురాఘవేంద్ర ప్రాజెక్ట్ కింద ఉన్న చెరువుల బోర్లు ఎత్తుకెళ్లిన ఘనత అక్కడి ఎమ్మెల్యే విష నాగు కు ఉంది. ఎమ్మిగనూరులో మిరప మార్కెట్ ఏర్పాటు చేసి కోల్డ్ స్తోరేజి నిర్మిస్తాం. రైతులకు గిట్టుబాటు ధర కల్పించి, పెట్టుబడులు తగ్గిస్తాం. జగన్ మోహన్ రెడ్డి రద్దు చేసిన పతకాలను తిరిగి ప్రారంభించి రైతులకు అండగా ఉంటామని ఎవరు భయపడవద్దు అని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగే శ్వర రెడ్డి, మాజీ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి, భూమా అఖిల ప్రియ, మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు ఎంఎల్సి బీటీ నాయుడు భూమి రెడ్డి రామ్గోపాల్ రెడ్డి, రైతులు టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News