డిజిపి రాజేంద్రనాథ్ రెడ్డి ఆదేశాల మేరకు ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న సమాచారం మేరకు కర్నూలు జిల్లాలోని డివిజనల్ కో-ఆపరేటివ్ కార్యాలయం అసిస్టెంట్-రిజిస్ట్రార్ శ్రీమతి ప్రేమరపోగు సుజాతకు చెందిన ఇల్లు, కార్యాలయంతో పాటు కర్నూలు నగరంలోని ఐదు ప్రాంతలలోని ఆమె బంధువుల ఇళ్ళలో అవినీతి నిరోధక శాఖ(ఏసిబి) కర్నూలు విభాగం అధికారుల బృందం ఉదయం నుండి ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. అసిస్టెంట్-రిజిస్ట్రార్ శ్రీమతి ప్రేమరపోగు సుజాత నుండి ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్న ఆస్తుల వివరాలు:
• కర్నూలు పట్టణంలోని శ్రీరామ్ నగర్ కాలనీలో ఒక G+2 ఇల్లు,
• కర్నూలు టౌన్ అశోక్ నగర్ కాలనీలో ఒక G+1 ఇల్లు,
• కస్తూరి నగర్ కాలనీ, కర్నూలు టౌన్ లో ఇల్లు
• బుధవారిపేట, కర్నూలు టౌన్‌లో G+1 దుకాణంతో కూడిన ఇల్లు
• బుధవారిపేట, కర్నూలు టౌన్‌లో మరో దుకాణం
• కర్నూలు మండలం సుంకేసుల గ్రామంలో 2.50 ఎకరాల వ్యవసాయ భూమి.
• కర్నూలు పట్టణం శివారు ప్రాంతంలో రూ.23,16,000/- విలువ చేసే ఎనిమిది ఇళ్ల స్థలాలు
• 40 తులాల బంగారం
• ఒక ఫోర్ వీలర్ (టాటా విస్టా) కారు, ఒకటి 2 వీలర్.
• ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లు, బంగారం మరియు గృహోపకరణాలు
• రూ. 8,21,000/- నగదు
అసిస్టెంట్-రిజిస్ట్రార్ శ్రీమతి ప్రేమరపోగు సుజాత ఇంట్లో ఇంకా ఏసిబి అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. అవినీతి అధికారులపై ప్రజలు ఫిర్యాదు కోసం 14400
అవినీతి నిరోధక శాఖ ప్రజల కోసం ప్రత్యేకంగా అందుబాటులో ఉంచిన 14400 నెంబర్ ను ప్రతిఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని, ఎవరైనా అధికారులు వేధింపులకు పాల్పడితే ప్రజలు ఈ నెంబర్ ద్వారా అవినీతి నిరోధక శాఖ అధికారులను సంప్రదించవచ్చని డిజిపి రాజేంద్రనాథ్ రెడ్డి పేర్కొన్నారు.