Friday, September 20, 2024
Homeహెల్త్Summer weight loss: వేసవిలో బరువు తగ్గాలంటే

Summer weight loss: వేసవిలో బరువు తగ్గాలంటే

వేసవి ఎంజాయ్మెంట్స్ తో శరీరం ఎక్కువ కిలోలు పెరిగే అవకాశం ఉంది. అంతేకాదు ఎండల ప్రభావం శరీరంపై రకరకాల రీతిల్లో పడుతుంది కూడా. అందుకే వేసవిలో శరీర బరువు తగ్గడానికి కొన్ని ఫిట్నెస్ టిప్పులు పాటిస్తే మంచి ఫలితాలు చూడొచ్చు. సమ్మర్ లో శరీర బరువు తగ్గాలంటే డైట్ విషయంలో కొన్ని మార్పులు చేబట్టాలి. ఈ ఏడాది వేసవి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండడంతో ఫిట్ నెస్ పై దాని దుష్పరిణామాలు బాగా పడే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. మీరు తీసుకునే డైట్ లో కొన్ని మార్పుచేర్పులు చేసుకోవడం ద్వారా ఆ దుష్ఫరిణామాల బారిన పడకుండా ఉండొచ్చని, బరువు కూడా
తగ్గొచ్చని అంటున్నారు. ఇందుకుగాను ఫుడ్ విషయంలోనే కాకుండా వేసవిలో తాగే డ్రింకుల విషయంలోనూ కొన్ని మార్పులు చేబట్టాల్సి ఉంటుందంటున్నారు. ఇందులో భాగంగా శరీరాన్ని ఎల్లవేళలా
హైడ్రేటెడ్ గా ఉంచుకోవాలని పోషకాహారనిపుణులు, వైద్యులు చెప్తున్నారు. వేసవిలో ఫ్లూయిడ్స్ బాగా తీసుకోవడం వల్ల శరీరానికి చల్లదనం అందడమే కాకుండా శరీర క్రియలు కూడా బాగా జరుగుతాయని చెప్తున్నారు. నేచురల్ డ్రింకులు శరీరంలో విషతుల్యమైన మలినాలు లేకుండా చేస్తాయని సూచిస్తున్నారు.
జీవక్రియ కూడా బాగా జరిగేలా ఈ డ్రింకులు సహాయపడతాయిట. అందుకనే వేసవిలో సరైన డ్రింకులను ఎంపిక చేసుకుని తాగాలంటున్నారు. దురద్రుష్టం ఏమిటంటే మార్కెట్ లోని పలు ప్యాకేజి డ్రింకులు, సోడాలలో షుగర్ శాతం అధికంగా ఉంటుంది. అవి తాగడం శరీరానికి అస్సలు మంచిది కాదు. బరువు కూడా పెరుగుతారు. అందుకే వాటిని కాకుండా చక్కెర లేని, ఇంట్లో తయారుచేసిన డ్రింకులు తాగితే శరీరానికి అత్యుత్తమమని చెప్తున్నారు. అలాగే పెరుగులాంటి ప్రోబయొటిక్ ఫుడ్స్ తీసుకోవాలని చెప్తున్నారు. ఇది జీర్ణవ్యవస్థ సమస్యలను నివారిస్తుందంటున్నారు. దాంతోపాటు వేసవిలో శరీరానికి
మంచి కూలింగ్ ఎఫెక్టును కూడా పెరుగు ఇస్తుందని చెప్తున్నారు. వేసవిలో తీసుకోవాల్సిన ముఖ్యమైన ఫుడ్ పెరుగు అని ఫిట్నెస్ నిపుణులు సైతం సూచిస్తున్నారు.

- Advertisement -

వేసవిలో మజ్జిగ నీళ్లు తాగితే శరీరానికి ఎంతో మంచిదని చెప్తున్నారు. మజ్జిగ వెయిట్ లాస్ కు ఎంతగానో దోహదపడే ఫ్రెండ్లీ డ్రింకు అని అంటున్నారు. అలాగే నీళ్లు బాగా ఉండే పండ్లు వేసవిలో వెయిట్ లాస్ మంత్రాకు బాగా ఉపకరిస్తాయని చెప్తున్నారు. అందుకే కీరకాయ, పుచ్చకాయ, ఖర్బూజా వంటి వాటిని వేసవిలో బాగా తినాలని ఆహారనిపుణులు చెప్తున్నారు. ఈ పండ్లల్లోని నీరు శరీరానికి అందించే లాభాలు ఎన్నో. ఈ పండ్లలోని నీరు జీర్ణశక్తి సరిగా అయ్యేలా సహకరిస్తుంది. ఎసిడిటీని తగ్గిస్తుంది. మలబద్దకం వంటి సమస్యలను పరిష్కరిస్తుంది. మరో అంశం ఏమిటంటే బరువు తగ్గడానికి, జీర్ణవ్యవస్థ పనితీరుకు మధ్య సన్నిహిత సంబంధం ఉంది. జీర్ణవ్యవస్థ బాగా ఉంటే శరీర ఫిట్ నెస్, బరువు కూడా ఆటోమేటిక్ గా ఆరోగ్యకరంగా ఉంటాయి. అంతేకాదు ఈ పండ్లు శరీరానికి కావలసిన నీటిని అందజేస్తుంది. ఈ పండ్ల లో కాలరీలు కూడా తక్కువగానే ఉంటాయి. కాబట్టి వెయిట్ లాస్ రొటీన్ లో ఫ్రూట్స్ చాలా ముఖ్యమైనవని మరవొద్దు. వేసవిలో వెల్లుల్లి, మిరప, అల్లం వంటివి శరీరంలో మరింత ఉష్ణాన్ని పెంచుతాయి.

అందుకే వేసవిలో వీటిని ఆహారపదార్థాలలో పరిమితంగా వాడడం మంచిదని పోషకాహారనిపుణులు సూచిస్తున్నారు. అంతేకాదు శరీరంపై కూలింగ్ ప్రభావాన్ని చూపే సోంపు, జీలకర్ర, ధనియాలు, పుదీనా వంటి వాటిని వంటపదార్థాల్లో సమ్రుద్ధిగా ఉపయోగించాలని వీళ్లు చెప్తున్నారు. వెయిట్ లాస్ రెజీమ్ లో ఉన్నవాళ్లకు మాత్రమే కాకుండా అందరికీ ఇవి మంచి ఆరోగ్యాన్ని అందిస్తాయని చెప్తున్నారు. జీలకర్ర నీళ్ల వంటివి తాగడం వల్ల శరీరంలోని మలినాలు పోవడంతో పాటు తిన్న ఆహారం బాగా జీర్ణమయ్యేలా తోడ్పడుతుంది కూడా. శరీర బరువును కూడా సోంపు, జీలకర్ర, పుదీనా నీళ్లు తగ్గిస్తాయని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. వెయిట్ లాస్ కోసం వేసవిలో వచ్చే మధురమైన మామిడిపండును తినకుండా ఉండనక్కర్లేదని కూడా పోషకాహారనిపుణులు చెప్తున్నారు. ఈ పండును సరైన సమయంలో, సరైన పాళ్లల్లో తీసుకోవాలని, తర్వాత కాలరీలను బర్న్ చేయాలని సలహా ఇస్తున్నారు. మామిడి పళ్లల్లోని పీచు పదార్థాల వల్ల కడుపు నిండుగా ఉండి చిరుతిళ్లపై ఏమాత్రం ద్రుష్టిపోదని చెప్తున్నారు. అలా వేసవిలో శరీర బరువు తగ్గడానికి మామిడిపండు సైతం సహకరిస్తుందని చెప్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News