కర్నూలు జనరల్ హాస్పిటల్ లో 18 20 పనిచేసిన ఔట్సోర్సింగ్ ఉద్యోగులను అన్యాయంగా తొలగించారని గత 400 రోజులుగా ఆందోళన చేస్తున్న భాగంలో ఈరోజు కర్నూల్ ప్రభుత్వ హాస్పిటల్ కు వచ్చిన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజిని, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ ము నెప్ప , ఎన్ మనోహర్ మాణిక్యం వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయనతో మాట్లాడుతూ తొలగించిన ఉద్యోగుల్లో 40 సంవత్సరాలు పైబడిన వాళ్లు ఎక్కువగా ఉన్నారని, వారు ఇతర ఉద్యోగాలకు పోవడానికి కూడా అవకాశం లేదని తక్షణమే వారికి ఉద్యోగాలు ఇచ్చి వారి కుటుంబాలను ఆదుకోవాలని మంత్రిని కోరారు. గతంలో ఉన్న కలెక్టర్ కోటేశ్వరరావు వీరికి ఉద్యోగాలు ఇస్తామని బదిలీ అయిపోయారని ఇప్పుడు కొత్తగా వచ్చిన కలెక్టర్ కి ఈ విషయం మంత్రులే చెప్పాలని వారు విజ్ఞప్తి చేశారు. దీనికి స్పందించిన మంత్రి, ఈ సమస్య పరిష్కారం అయ్యేలా చొరవ తీసుకుంటానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు రాము రెహమాన్ మల్లన్న తొలగించిన ఉద్యోగులు లక్ష్మన్న వేణుగోపాల్ శీను అంజి నాగరాజు సుజాత విజయ వెంకటేశు ఆదినారాయణ రమణ తదితరులు పాల్గొన్నారు.