Saturday, November 23, 2024
HomeతెలంగాణBRS: కిషన్ రెడ్డి సీబీఐ విచారణకు రెడీ కావాలి

BRS: కిషన్ రెడ్డి సీబీఐ విచారణకు రెడీ కావాలి

నెహ్రు ఔటర్ రింగు రోడ్డు లీజు కు సంబంధించి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ ఆరోపణల్లో నిజం లేదని, ..గతం లో కేంద్ర ప్రభుత్వం రూపొందించిన నిబంధనల మేరకే బిడ్డింగ్ జరిగిందంటూ అధికార పార్టీ ఎమ్మెల్యేలు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, కె. పి. వివేకానంద ప్రెస్ వివరించారు. నాలుగు ప్రముఖ సంస్థలు షార్ట్ లిస్ట్ అయ్యాయని, అందులో ఎక్కువ కోట్ చేసిన వారికే లీజు దక్కిందని వివేకా, సుధీర్ వివరించారు.
కిషన్ రెడ్డి డిమాండ్ చేసినట్టు మేము సీబీఐ విచారణకు సిద్ధంగా ఉన్నామని, ..కిషన్ రెడ్డి సీబీఐ విచారణ కు సిద్ధం కావాలని వారు సవాలు చేశారు.
ఆదానీ పై జేపీసీ వేయని వారు సీబీఐ కి డిమాండ్ చేస్తున్నారని, పూణేలో ఇక్కడ లీజు తీసుకున్న వారే తీసుకున్నారని, బీజేపీ ఆరోపణల్లో పసలేదన్నారు. ఇప్పటికైనా ప్రజలకు పనికొచ్చే విషయాలపై మాట్లాడాలని వివేకా హితవు పలికారు. మంత్రి కే టీ రామారావు చొరవతో హైద్రాబాద్ కు అంతర్జాతీయ ఖ్యాతి దక్కడాన్ని సహించలేక బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఆయన టార్గెట్ గా విమర్శలు చేస్తున్నాయని వారు ఆరోపించారు. పెద్దోళ్లను తిడితే పేపర్లలో పతాక శీర్షికల్లో వస్తామని చవకబారు విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
రాష్ట్రంలో ఏదీ జరిగినా దానికి ktr కారణం అన్నట్టుగా కాంగ్రెస్ బీజేపీ నేతలు మాట్లాడుతున్నారన్నారు. పేపర్ లీకేజీ, orr వ్యవహారాల్లో ప్రతిపక్షాల తీరు అభాసు పాలయ్యే విధంగా ఉందని, కాంగ్రెస్ యూత్ డిక్లరేషన్ లో ఎలాంటి కొత్త దనం లేదన్నారు. ఇప్పటికే విడుదల అయిన రైతుల డిక్లరేషన్ ను ప్రజలు మరచిపోయారన్నారు. కర్నాటకలో బీజేపీ చావుదెబ్బ తినబోతోందని, సిద్ధ రామయ్య లాంటి నేతలను చూసి అక్కడ కాంగ్రెస్ కు ఓట్లు వేస్తున్నారన్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ కు అలాంటి నేతలు లేరని, తెలంగాణలో ఎలాగూ అధికారంలోకి రాలేమని కాంగ్రెస్ నేతలు పనికి రాని అంశాలపై మాట్లాడుతున్నారన్నారు. ప్రియాంక తెలంగాణ ఇచ్చామని ఇపుడు చెబుతూ ఓట్లు అడుగుతున్నారు, 2014, 2018 లలో కేసీఆర్ ను ప్రజలు ఆశీర్వదించి కాంగ్రెస్ ను తిరస్కరించారని వారు అన్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా కేసీఆర్ కే ప్రజలు పట్టం కడుతారని, కేసీఆర్ తెలంగాణ ప్రజల గుండెల్లో ఉన్నారని, .కాంగ్రెస్ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణ పథకాలు అమలు చేసి ఇక్కడ మాట్లాడాలని వివేకా, సుధీర్ అన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News