యువగళం పాదయాత్ర భాగంగా పట్టణంలో స్థానిక ఎన్ ఎస్ పంక్షన్ ప్రక్కన ఏర్పాటు చేసిన
బహిరంగ సభలో రాష్ట్ర సీఎం జగన్ ను సైకో, గోల్మాల్ జగన్ అంటూ, నియోజవర్గ అభివృద్ధి టిడిపి హయాంలో నేనని, ఎమ్మెల్యేకు ఏ అధికారి మాట వినడం లేదంటూ నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్యే తోగూర్ అర్థర్ తీవ్రంగా ఖండించారు. పట్టణంలోని స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే తోగూర్ ఆర్థర్ పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే ఆర్థర్ మాట్లాడుతూ.. నియోజవర్గాన్ని అభివృద్ధి చేసింది టిడిపినేనంటూ నారా లోకేష్ అనటం యువగళం బహిరంగ సభలో మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. నేటి వైసిపి పాలనలో సీఎం జగన్ మోహన్ రెడ్డి నియోజవర్గ అభివృద్ధి కోసం కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేశారని అది ప్రజలను ఎవరిని అడిగినా చెప్తారన్నారు. నియోజవర్గంలో దళిత ఎమ్మెల్యే మాటలను ఏ అధికారి వినడం లేదంటూ యువగళం సభలో మాట్లాడడం విడ్డూరంగా ఉందని నియోజవర్గంలో 86 సచివాలయాల్లో అభివృద్ధి పనులు జరిగాయని, అవి టిడిపి నాయకులు కనబడడం లేదు అంటూ ఎద్దేవ చేశారు. నియోజవర్గ ఎమ్మెల్యేగా పూర్తిస్థాయిలో అన్ని శాఖల అధికారులకు ప్రజల కోసం ఆదేశాలు మాత్రమే కాకుండా న్యాయం జరిగేలా చూస్తారని అంతటి స్వేచ్ఛ సీఎం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఉందన్నారు. సీఎం జగన్ నాయకత్వంలో బడుగు బలహీన వర్గాల ఎమ్మెల్యే లకు ఉన్నంత స్వేచ్ఛ ఎక్కడా లేదన్నారు. నందికొట్కూరులో కబ్జాలకు పాల్పడ్డారని ఆరోపణ సరైనవి కావన్నారు. జననేత జగన్ పై సైకో, గోల్మాల్ జగన్ అంటూ వ్యాఖ్యానించడం ప్రజలు హర్షించరని ఇలాంటి అవాక చావకులను మాటలు సరికవని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్స్ జాకీర్ హుస్సేన్, ఉండవల్లి ధర్మ రెడ్డి, సింగల్ విండో చైర్మన్ సగినేలా హుస్సేనయ్య, పైపాలెం షేక్ ఇనయతుల్లా, వైఎస్ఆర్సిపి నాయకులు జాన్, మహిళా నాయకురాలు డాక్టర్ వనజ తదితరులు పాల్గొన్నారు
Nandikotkuru: బలహీన వర్గాల ఎమ్మెల్యేలకు జగన్ సర్కారులో స్వేచ్ఛ ఎక్కువ
సంబంధిత వార్తలు | RELATED ARTICLES