Thursday, September 19, 2024
Homeనేరాలు-ఘోరాలుKonaraopeta: మావోయిస్టు జ్యోతక్క లొంగుబాటు

Konaraopeta: మావోయిస్టు జ్యోతక్క లొంగుబాటు

మావోయిస్టు పార్టీ డీసీఎం నేరెళ్ల జ్యోతి అలియాస్ జ్యోతక్క కరీంనగర్ పోలీసుల ముందు లొంగిపోయారు. కరీంనగర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీపీ సుబ్బరాయుడు ఈ విషయాన్ని వెల్లడించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం శివంగలపల్లికి చెందిన జ్యోతి (38) రెండు దశాబ్దాలుగా మావోయిస్టు పార్టీలో పని చేస్తున్నారని డీసీఎం హోదాలో ప్రెస్ ఇంఛార్జిగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఆసిఫాబాద్ జిల్లాలోని ప్రాణహిత పరివాహక ప్రాంతంలోని మంగి ఏరియాలో పనిచేసిన జ్యోతి 2011లో జరిగిన ఎదురు కాల్పుల్లో తప్పించుకుని మావోయిస్టు పార్టీ నేత జంపన్నతో కలిసి ఒడిషాకు వెల్లి అక్కడి పార్టీ కార్యకలాపాల్లో పాల్గొన్నదని వివరించారు. ఒడిషాలో ప్రెస్ కమిటీ మెంబర్ గా పనిచేస్తున్న సమమంలో ఎర్రగొల్ల రవి అలియాస్ దినేష్ ను వివాహం చేసుకోగా వీరిద్దరి మద్య వచ్చిన విబేధాల కారణంగా విడిపోయారన్నారు. మొత్తం ఐదు కేసుల్లో ఉన్న జ్యోతి ‘ఆపరేషన్ చేయూత’ కార్యక్రమంలో భాగంగా లొంగిపోయినట్టు సీపీ వెల్లడించారు. లొంగిపోయిన నేరెళ్ల జ్యోతి పై ఉన్న ఐదు లక్షల రూపాయల రివార్డు నగదు ప్రభుత్వం తరఫున పునరావాసం జీవనోపాధి ఇతర ప్రతిఫలాలు అందజేయబడతాయని తెలిపారు.జ్యోతక్క లొంగుబాటుతో ఈ విషయం కోనరావుపేట మండలంలో ప్రతి ఒక్కరి నోట చర్చనీయాంశంగా మారింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News