Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్Tadakanapalli: పాలకోవా కేంద్రంలో కలెక్టర్

Tadakanapalli: పాలకోవా కేంద్రంలో కలెక్టర్

తడకనపల్లె గ్రామంలో ఏర్పాటు చేసిన పాలకోవా కేంద్రంతో పాటు ఉల్లి, టొమాటో సోలార్ డ్రైయర్ లను జిల్లా కలెక్టర్ డా.జి. సృజన పరిశీలించారు. కల్లూరు మండలం తడకనపల్లె గ్రామంలోని ఏపీఎంఐపి పథకం కింద పొందిన పరికరాలను, పాలకోవా తయారీ యూనిట్ లను, ఉల్లి, టొమాటో సోలార్ డ్రైయర్లను, పశువుల సంరక్షణ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ డా.జి. సృజన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ముందుగా ఏపీఎంఐపి పథకం కింద స్ప్రింక్లర్స్ పొందిన లబ్ధిదారుడు శరత్ ఇంటికి వెళ్ళి అతనితో మాట్లాడుతూ స్ప్రింక్లర్స్ ఉపయోగం పట్ల అవగాహన ఉందా ? ప్రస్తుతానికి ఏ పొలానికి వాడుతున్నారు ? స్ప్రింక్లర్స్ ఎంతకి కొన్నారు ? ఎంత సబ్సిడీ వచ్చింది అని ఆరా తీయగా లబ్ధిదారుడు వివరిస్తూ స్ప్రింక్లర్స్ ఉపయోగం పట్ల అవగాహన ఉందని ప్రస్తుతానికి వేరుశనగ, ఉల్లి పొలాలకు వాడుతున్నామని 17 వేల రూపాయలతో కొన్నడం జరిగిందని అందులో 13 వేల రూపాయల సబ్సిడి ఇచ్చారని తెలిపారు. ఇక్కడ ఇప్పటి వరకు 12 మందికి స్ప్రింక్లర్స్ ఇచ్చినట్టు, ఏపీఎంఐపి పిడి కలెక్టర్ కి తెలిపారు. వైఎస్సార్ యంత్రా సేవ పథకం కింద క్లస్టర్ హైరింగ్ సెంటర్ గ్రూప్ ల ద్వారా పొందిన ట్రాక్టర్, రౌటర్లు ఇతరులకు రెంట్ రూపంలో 10 శాతం తగ్గించి ఇవ్వడం జరుగుతుందని వాటి ద్వారా వచ్చిన సొమ్మును మరల తిరిగి బ్యాంకు ద్వారా పొందిన లోన్ కి సంబందించిన ఇన్స్టాల్మెంట్ చెల్లించడం జరుగుతుందని కలెక్టర్ కి వివరించారు . తడకనపల్లె పాలకోవా కేంద్రంలో పాలకోవా చేసే విధానాన్ని పరిశీలిస్తూ 20 లీటర్ల పాలకు 5 కిలోల చక్కెరకు ఎన్ని కేజిల పాలకోవా వస్తుందని గ్రామైఖ్య సంఘం లీడర్ జుబేదాని అడగగా 8 కిలోల పాలకోవా వస్తుందని, ఎవ్వరికైనా నెయ్యి కావాలని లేదంటే స్పెషల్ గా బెల్లం పాలకోవా కావాలని ఆర్డర్ లు వస్తే అవి కూడా చేస్తామని కలెక్టర్ కి తెలిపారు. పాలు ఎక్కడి నుంచి తీసుకుని వస్తారని జుబేదాని అడగగా ఇక్కడ దగ్గర్లో ఉన్న పశువుల హాస్టల్లో నాలుగు గ్రూపు లకు కలిసి 80 బర్రెలు ఉన్నాయని అక్కడి నుండి పాలు తీసుకొని వస్తామని తెలిపారు. బాయిలర్ మిషన్ తక్కువ బడ్జెట్ కి ఇప్పించినట్లైతే ఇంకా ఎక్కువమంది పాలకోవా కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారని కలెక్టర్ దృష్టికి జుబేదా తీసుకొని రాగా అందుకు తగిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. పశువుల హాస్టల్ తనిఖీ చేస్తూ బర్రెలను కడగడం, పాలు పితకడం మరియు దాణా వేయడం వంటి పనులు ఎవరు చేస్తారని అదే విధంగా రోజుకి ఎన్ని లీటర్ల పాలు వస్తాయి, పేడను ఏ విధంగా ఉప్పయోగిస్తున్నారని జుబేదా ను ఆరా తీశారు ఇక్కడ పని వాళ్ళను ఏర్పాటు చేశామని మొత్తం వాళ్లే చూసుకుంటారని వాళ్లకి నెలకి 15 వేల వేతనం ఇస్తున్నామని రోజుకు 300 లీటర్ల పాలు వస్తాయని అవి మొత్తం పాల్కోవా కి ఉప్పయోగిస్తామని, పేడను రైతులు ఎరువులకు ఉపయోగిస్తారని కలెక్టర్ కి వివరించారు. పశువులకు దాణా వేసే గడ్డికి రసాయన ఎరువులు వాడకుండా వేసినట్లయితే ఆర్గానిక్ గా పాలు-పాలకోవా తయారికి ఉపయోగపడడమే కాకుండా వాటిని కొనుగోలు చేయడానికి ప్రజలు మరింత మక్కువ చూపిస్తారని కలెక్టర్ జుబేదాకి సూచించారు. ఉల్లి, టొమాటో సోలార్ డ్రైయర్లను తనిఖీ చేస్తూ వాటిని కట్ చేస్తున్న విధానాన్ని మరియు డ్రై చేస్తున్న విధానాన్ని పరిశీలిస్తూ ఉల్లికి సంబంధించి రోజుకు ఎన్ని బ్యాగులు కట్ చేస్తారని మీరు వాటిని డ్రై చేసిన తర్వాత ఆనియన్ ఫ్లెక్స్ మహారాష్ట్రకి సంబంధించిన s4s టెక్నాలజీ వారికి ఇచ్చేటపుడు తయారు నిమిత్తం ఛార్జీల ఇవ్వడంతో పాటు మీకు అయిన కరెంట్ బిల్ కూడా కలిపి ఇస్తున్నారా లేదా అని అక్కడ ఉన్న సభ్యులను అడగగా రోజుకి నాలుగు బ్యాగులు కట్ చేస్తామని వాటిని డ్రై చేసిన తర్వాత ఆనియన్ ఫ్లెక్స్ ప్యాక్ చేసి అమ్మేటప్పుడు కరెంట్ బిల్ తో కలిపి డబ్బులు చెల్లిస్తారని కలెక్టర్ కి వివరించారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ పిడి వెంకట సుబ్బయ్య, ఏపీఎంఐపీ పిడి ఉమా దేవి, తడకనపల్లి గ్రామైఖ్య సంఘం లీడర్ జుబేదా తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News