Friday, September 20, 2024
HomeతెలంగాణPochampalli: గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను గుర్తించేందుకు సీఎం కప్

Pochampalli: గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను గుర్తించేందుకు సీఎం కప్

గ్రామీణ స్థాయి నుంచే యువ క్రీడాకారుల ప్రతిభను గుర్తించి వారిని ప్రోత్సహించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నడూ లేని విధంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న చీఫ్ మినిస్టర్ కప్ – 2023లో భాగంగా ఈ రోజు స్థానిక ప్రభుత్వ పాఠశాల యందు మండల స్థాయి క్రీడా పోటీలను ఎంపీపీ మాడుగుల ప్రభాకర్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి చిట్టిపోలు విజయలక్ష్మి, జెడ్.పి.టి.సి కోట పుష్పలత ప్రారంభించారు. దాదాపు 10,000 మంది క్రీడాకారులను తయారు చేసే లక్ష్యంలో ఈ పోటీలు నిర్వహించబడుతున్నాయని మండల స్థాయిలో ప్రతిభ కనబరిచిన వారికి జిల్లా స్థాయికి, జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయికి ఎంపిక చేస్తారని, మండల స్థాయి మొదటి బహుమతి టీం కు రూపాయలు 10,000/- బహుమతిగా, మండల స్థాయి రెండవ బహుమతి టీంకు రూపాయలు 5,000/- బహుమతిగా ఇస్తారన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎం.పి.పి. పాక వెంకటేష్ యాదవ్, వైస్ చైర్మన్ బాత్క లింగస్వామి, పి.ఏ.సి.ఎస్. చైర్మన్ కందాడి భూపాల్ రెడ్డి, మండల ప్రత్యేక అధికారి విద్యా సాగర్, తహశీల్దార్ వీరబాయి, ఎం.పి.డి.ఒ బాలశంకర్, ఎస్.ఐ. విక్రమ్ రెడ్డి, కౌన్సిలర్లు పెద్దల చక్రపాణి, కర్నాటి రవీందర్, గుండు మధు, సామల మల్లారెడ్డి, దేవరాయ కుమార్, గునిగంటి మల్లేష్ గౌడ్, చేరాల నరసింహ, మున్సిపల్ సిబ్బంది, ఎం.పి.డి.ఒ సిబ్బంది, మండల స్థాయి క్రీడాకారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News