Saturday, November 23, 2024
HomeతెలంగాణCheryala: డాక్టరేట్ సాధించిన టీచర్

Cheryala: డాక్టరేట్ సాధించిన టీచర్

చేర్యాల మండలంలోని రాంపూర్ గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు డాక్టర్ మలిపెద్ది బాల భాస్కర్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డాక్టర్ పట్టా పొందిన సందర్భంగా కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు నిమ్మ మహేందర్ రెడ్డి అధ్వర్యంలో గ్రామస్థులు డాక్టర్ బాల భాస్కర్ కు వారి తల్లిదండ్రులైన మలిపెద్ది హన్మంతు సరస్వతిలను ఘనంగా సన్మానించి, మిఠాయిలు తినిపించారు. ఈ సందర్భంగా కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు నిమ్మ మహేందర్ రెడ్డి మాట్లాడారు. చదువుతోనే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని పేర్కొన్నారు. నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన బాల భాస్కర్ ప్రభుత్వ ఉపాద్యాయ ఉద్యోగం పొంది ప్రస్తుతం మండలంలోని పోతిరెడ్డిపల్లి-పెద్దరాజుపేట ప్రభుత్వ పాఠశాలలో విధులు నిర్వహిస్తూ ఎంతో మంది యువతి యువకులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దడమే కాకుండా ఉపాధ్యాయ వృత్తికే వన్నె తెస్తున్న బాల భాస్కర్ రాంపూర్ గ్రామంలోనే మొదటి వ్యక్తిగా డాక్టరేట్ పట్టా పొందడమే కాకుండా వారి తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చడం అభినందనీయం అన్నారు. భాస్కర్ ను యువకులు ఆదర్శంగా తీసుకొని తల్లితండ్రుల ఆశలను, వారి కలలను సహకారం చేయాలన్నారు. పీహెచ్ డీ పరిశోధనలో సహకరించిన యూనివర్సిటీ ప్రొఫెసర్లు,స్నేహితులు, కుటుంబ సభ్యులు ప్రోత్సాహం మరువలేనిదని డాక్టర్ బాల భాస్కర్ గుర్తు చేశారు. దేశంలోనే ఉన్నంతమైన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో డాక్టరేట్ సాధించిన భాస్కర్ ను ఉస్మానియా ప్రొఫెసర్లు, గ్రామ ప్రజలు అభినందించారు. సన్మానంలో ఉపాద్యాయ నాయకుడు నిమ్మ రాజీవర్దన్ రెడ్డి, నిమ్మ లక్ష్మ రెడ్డి, జర్నలిస్ట్ గణేష్ తివారి తదితరులు ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News