Friday, November 22, 2024
Homeఆంధ్రప్రదేశ్Banaganapalli: సీఎం పాదం మంచిది కాదు: లోకేష్

Banaganapalli: సీఎం పాదం మంచిది కాదు: లోకేష్

బనగానపల్లెలోని ఫ్యాక్షనిజంను అరికట్టింది చంద్రబాబు నాయుడని యువగళం పాదయాత్రలో భాగంగా లోకేష్ అన్నారు. నారా చంద్రబాబునాయుడు మంచి పాదమైతే జగన్ ది దరిద్రమైన పాదమంటూ లోకేష్ భగ్గుమన్నారు. వైసీపీ హయాంలో జి ఓ 1 చివరికి కన్నీరే మిగిలిందన్నారు లోకేష్. ఐదు ప్యాలెస్లు కట్టించుకున్న వాడు పేదవాడైతాడా అని ఒకసారి ఆలోచించాలన్నారు. దేశంలోనే ధనిక సీఎంకి ప్రజల మధ్యన 2024 లో నిశ్శబ్ద యుద్ధం జరగబోతుందని, దానికి నిదర్శనం గ్రాడ్యుయేట్ ఎన్నికలన్నారు. పేదరికం లేని రాష్ట్రంమే తెలుగుదేశం పార్టీ లక్ష్యమన్న లోకేష్.. పేదవారు శాశ్వతంగా పేదరికంలోనే ఉండాలనాదే జగన్ లక్ష్యమని ఆవేదన వ్యక్తంచేశారు. ఎన్నికల ముందు జగన్ చాలా హామీలు ఇచ్చారని ఎప్పుడూ దాని గురించి లేదని, అందుకే జగన్ కు ముద్దు పేరు పెట్టానని అది ‘బిల్డప్ బాబాయ్ జగన్’ అని లోకేష్ ఆరోపించారు. 100 రూపాయల కంటే ఎక్కువ అయ్యే ఖర్చులన్నీ ఆరోగ్యశ్రీలో చేర్చుతామని కానీ ప్రైవేట్ ఆస్పత్రులకు 12 వేల కోట్ల రూపాయలు బాకీ పెట్టిన ఘనత జగన్ దేనని ఆరోపించారు. ఆరోగ్యశ్రీని అనారోగ్యంగా మార్చిన ఘనత జగన్ దేనన్నారు. ఆరోగ్యశ్రీతో చికిత్స ఇవ్వలేరని, ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు లేరని, మందులు లేవు కానీ డాక్టర్లు ఇంటికి పంపుతాడా అని నిలదీశారు లోకేష్. తాము అధికారంలోకి వచ్చాక పద్ధతి ప్రకారం డీఎస్సీ ద్వారా 5 సంవత్సరాల్లో పోస్టులన్నీ భర్తీ చేస్తాను అని యువతకు హామీ ఇస్తున్నా అన్నారు లోకేష్. ఈ కార్యక్రమంలోటిడిపి కార్యకర్తలు బీసీ జనార్దన్ రెడ్డి, అభిమానులు, నాయకులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News