Sunday, October 6, 2024
Homeనేరాలు-ఘోరాలుKonaraopeta: అందుబాటులో లేని వైద్య సిబ్బంది, చికిత్స చేసిన స్వీపర్!

Konaraopeta: అందుబాటులో లేని వైద్య సిబ్బంది, చికిత్స చేసిన స్వీపర్!

ఆదివారం వచ్చిందంటే చాలు ఆస్పత్రిలో సిబ్బంది ఎవరు ఉండడం లేదు. కోనరావుపేట మండల కేంద్రంలో ఆదివారం రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో చందుర్తి మండలం ఎన్గల్కు చెందిన ఇద్దరికి, కోనరావుపేటకు చెందిన ఒకరికి గాయాలయ్యాయి. స్థానికులు వీరిని కోనరావుపేటలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి తీసుకెళ్లారు. ఏఎన్ఎంలు, సిబ్బంది ఎవరూ లేకపోవడంతో స్వీపర్ గా పనిచేస్తున్న ఎల్లవ్వ ప్రథమచికిత్స చేసి పట్టి కట్టి ఆదుకుంది. గంట తర్వాత వచ్చిన ఏఎన్ఎం ఇంజక్షన్చేసి, మందులిచ్చి పంపింది. స్వీపర్ చికిత్స అందించడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం
చేస్తున్నారు. ఆదివారం వచ్చిందంటే ఆస్పత్రిలో ఎవరూ ఉండడంలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. గ్రామాల్లో పనిచేసే ఏఎన్ఎమ్ సమయపాలన పాటించకుండా,అందుబాటులో లేకపోవడం వల్ల గ్రామస్తులు ఇబ్బందులకు గురుతున్నారు. నిత్యం సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఉంటూ మండలం లోని సబ్ సెంటర్ లో పనిచేస్తున్న ఏఎన్ఎమ్ లు స్థానికంగా ఉండి సేవలు అందిచలని ప్రజలు కోరుతున్నారు.ద్విచక్ర వాహన ప్రమాదవిషయమై వైద్యాధికారి వేణుమాధవు వివరణ కోరగా విధుల్లో ఉన్న ఏఎన్ఎం వ్యక్తిగత పనిమీద
వెళ్లివచ్చి, తర్వాత చికిత్స అందించిందన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News