Friday, September 20, 2024
HomeతెలంగాణPuvvada: టీయుబ్ల్యూజే కృతజ్ఞత

Puvvada: టీయుబ్ల్యూజే కృతజ్ఞత

ఖమ్మం జిల్లా కేంద్రం జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాల పంపిణీకి 23 ఎకరాలు కేటాయించి, మంత్రివర్గం ఆమోదం పొందేలా కృషి చేసిన రాష్ట్ర రవాణాశాఖ మంత్రికి తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ TUWJ (టిజేఎఫ్) కృతజ్ఞతలు తెలిపింది. గ్రామీణ జర్నలిస్టులకూ ఇళ్ల స్థలాలు ఇచ్చేలా దృష్టి సారించాల్సిందిగా మంత్రిని కోరుతూ టీజెఫ్ ఖమ్మం జిల్లా కమిటీ వినతిపత్రం సమర్పించింది. TJF ఆధ్వర్యంలో మున్సిపల్ ఆఫీస్ సమీపంలో ఉన్న DPRC భవనంలో జరిగింది. కృతజ్ఞత సన్మాన సభలో మంత్రి అజయ్ కు జర్నలిస్టులు టీజెఎఫ్ ఖమ్మం జిల్లా కమిటీ సంఘీభావం ప్రకటించింది. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షులు ఆకుతోట ఆదినారాయణ మాట్లాడుతూ జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాకారానికి కృషి చేసిన మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. తదుపరి ప్రక్రియను కూడా అత్యంత వేగంగా పూర్తి చేసి త్వరగా ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేసేలా కృషి చేయాల్సిందిగా కోరారు. ఇళ్ల స్థలాల పంపిణీ పై ఇప్పటికీ రకరకాల ఊహాగానాలు ఉన్నాయి. ఇవి నివృత్తి అయ్యేలా ముందుగా విధివిధానాలను ప్రకటించాలని విన్నవించారు. అలాగే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వివిధ మండలాల్లో ఉన్న జర్నలిస్టుల అందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించేలా కృషి చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు హామీ మేరకు వర్కింగ్ జర్నలిస్టులందరికీ ఒక్కొక్కరికి 200 గజాల చొప్పున ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరారు.‌ వ్యత్యాసాలు లేకుండా అర్హులందరికీ ఇళ్ల స్థలాలివ్వాలని విన్నవించారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం, మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, టీయూడబ్ల్యూజే టీజేఎఫ్ జిల్లా అధ్యక్షులు ఆకుతోట ఆదినారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి చిర్రా రవి, ఐజేయు జాతీయ నాయకులు సాంబశివరావు, జిల్లా ఉపాధ్యక్షులు బొల్లం శ్రీనివాస్, ప్రశాంత్ రెడ్డి , టెంజు జిల్లా అధ్యక్షులు రజనీకాంత్, టీజేఎఫ్ పట్టణ అధ్యక్షులు రాఘవ, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు గుద్దేటి రమేష్, విజేత , భాస్కర్ రామారావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News