బనగానపల్లె నియోజకవర్గంలో కొలిమిగుండ్ల మండల కేంద్రం కస్తూర్బా పాఠశాల సమీపంలో రాంకో సిమెంట్ యాజమాన్యం వారి సహకారంతో రెండు కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించనున్న కళ్యాణ మండపానికి బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్ర బోతులా పాపిరెడ్డి భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గారు మాట్లాడుతూ మండల ప్రజల సౌకర్యం కోసం కళ్యాణ మండపం నిర్మించనున్నారు. చాలా రోజుల నుంచి నిర్మించాలని అనుకుంటున్నా అనివార్య కారణాలవల్ల ఆలస్యం అయిందన్నారు. రాంకో ఫ్యాక్టరీ యాజమాన్యం స్పందించి రెండు కోట్లతో నిర్మించేందుకు ముందుకు రావడం అభినందనీయమని కొనియాడారు. మండల ప్రజలు ఆ పెళ్లిళ్ల సమయంలో తాడిపత్రి, బనగానపల్లి, కోవెలకుంట్ల తదితర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుండేదన్నారు. ఇక్కడ ఏర్పాటు అయితే అందరికీ అందుబాటులో ఉంటుందన్నారు. కళ్యాణ మండపానికి అవసరమైన భూమికోసం జడ్పీ చైర్మన్ తో కలిసి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడంతో మంజూరు చేశారన్నారు. అన్నివర్గాల ప్రజలు పార్టీలకతీతంగా కళ్యాణ మండపాన్ని ఉపయోగించుకోవచ్చని సూచించారు. ప్రజల సౌకర్యం కోసం వంట సామాగ్రి, కుర్చీలు అందుబాటులోకి తెస్తే మరింత సౌకర్యంగా ఉంటుందన్నారు. అలాగే కళ్యాణ మండపం నిర్వహణ బాధ్యతలను కంపెనీ తీసుకుంటే మరింత బాగుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని కంపెనీ ప్రతినిధులను కోరారు.ఈ కార్యక్రమంలో రాంకో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రెడ్డి నాగరాజు, జనరల్ మేనేజర్ రవికుమార్, తాసిల్దార్ ధోని ఆల్ఫ్రెడ్, ఎంపీడీవో సుబ్బరాజు, వైఎస్ఆర్సిపి పబ్లిసిటీ వింగ్ జిల్లా అధ్యక్షుడు పేరం సత్యనారాయణ రెడ్డి, వైఎస్ఆర్సిపి మండల అధ్యక్షుడు అంబటి గురవి రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు నాయకులు హాజరయ్యరు.
Katasani: కల్యాణ మండపానికి భూమి పూజ
సంబంధిత వార్తలు | RELATED ARTICLES