Sunday, May 5, 2024
Homeఆంధ్రప్రదేశ్Allagadda: కాపులకు న్యాయం చేస్తాం: లోకేష్

Allagadda: కాపులకు న్యాయం చేస్తాం: లోకేష్

‘యువగళం’ పాదయాత్రను సాగనిస్తే పాదయాత్ర అడ్డొస్తే సైకో పాలనపై దండయాత్ర చేస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని దొర్నిపాడు మండల కేంద్రంలో ఆళ్లగడ్డ యువ నేత తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు భూమ జగత్ విఖ్యాత్ రెడ్డి తో కలసి పాదయాత్రను సాగించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన వెంటనే కాపులకు అన్ని విధాల న్యాయం చేస్తామని ఆయన కాపులకు హామీ ఇచ్చారు, కాపులకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పిస్తామన్నారు మనది సైకిల్ ప్రభుత్వం జగన్ది సైకో ప్రభుత్వమని ఆయన అన్నారు. జగన్ సిగ్గు లేకుండా పేదవాడినని ప్రచారం చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. లక్షల కోట్లు ఉన్నవాడు పేదవాడ లక్షలు విలువ చేసే చెప్పులు వేసుకునే వాడు పేదవాడా అని ఆయన ప్రశ్నించారు. టిడిపి నాయకులు కార్యకర్తలు నేతలపై కేసులు పెట్టి వేధిస్తున్న ఏ ఒక్కరిని వదిలిపెట్టమని ఆయన స్పష్టం చేశారు. దొర్నిపాడు మండల కేంద్రం చేరుకున్న ఆయనకు టిడిపి నాయకులు టిడిపి కార్యకర్తలు గ్రామ నాయకులు ప్రజలు అభిమానులు మహిళలు హారుతులతో భారీ గజమాలతో స్వాగతం పలికారు. దొర్నిపాడు మండల కేంద్రం నుండి రామచంద్రాపురం భాగ్యనగరం గ్రామాల గుండా ఆళ్లగడ్డ పట్టణంలోని చింతకుంటలకు చేరింది. అక్కడ నారా లోకేష్ కు ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో భూమా బ్రహ్మానందరెడ్డి చిక్కేపల్లి రామకృష్ణారెడ్డి సిద్ధి సత్యం మల్లేశ్వర చౌదరి కాకర్ల రమేష్ చౌదరి లింగుట్ల నాయుడు బాల్రెడ్డి సిద్ది నారాయణ జిల్లా సుబ్బరాయుడు దాని రంగరావు కొత్తపల్లి సురేంద్ర చౌడయ్య అమరేశ్వర యాదవ్ సందీప్ రెడ్డి భూమా సంతోష్ భూమా రమేష్ రెడ్డి ఉపసర్పంచ్ హరి సురేష్ పార్టీ కార్యకర్తలు నాయకులు అభిమానులు శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News