Monday, April 7, 2025
HomeతెలంగాణVeernapalli: BJP 'సంపర్క్ అభియాన్'

Veernapalli: BJP ‘సంపర్క్ అభియాన్’

వీర్ణపల్లి మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షులు గునుకుల దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో మహాజన్ సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ముఖ్యఅతిథిగా విచ్చేసిన బీజేపీ సీనియర్ నాయకులు నవభారత ఇండస్ట్రీ అధినేత గరిపల్లి ప్రభాకర్ శుక్రవారం రోజు కార్యకర్తలకు నాయకులకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా వారు తోటి కార్యకర్తలతో మాట్లాడుతూ 9 యేండ్ల బీజేపీ పరిపాలనలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సాధించిన విజయాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని మే 30 వ తేదీ నుండి జూన్ 30 వ తేదీ వరకు మహాజన సంపార్క్ అభియాన్ కార్యక్రమము చెపట్టణున్నట్లు సుమారు 30 రోజుల పాటు జిల్లా మండల శక్తి కేంద్రాల్లో, బూత్ స్థాయిలో ప్రతి ఇంటి గడప గడపకు నరేంద్ర మోడీ చేసిన ప్రగతిని వివరించాలని, ఈ బాధ్యత ప్రతి బీజేపీ కార్యకర్త పైన ఉందని గ్రామాలు అభివృద్ది చెందాలనే ఉద్దేశ్యముతో కేంద్ర ప్రభుత్వము అనేక నిధులను ప్రతి గ్రామ పంచాయతీకి విడుదలైన గ్రాంట్లను ప్రజలందరికీ ప్రతి పౌరునికి వివరించాలని రాబోయే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి తేవడమే లక్ష్యంగా ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడు కష్టపడి పని చేయాలని అన్నారు.
ఈ కార్యక్రమములో జిల్లా ఉపాధ్యక్షులు గుండాటి వెంకట్ రెడ్డి రైస్ మిల్లర్ జిల్లా ప్రధాన కార్యదర్శి సందుపట్ల రాజీ రెడ్డి పర్శరం రెడ్డి మాజీ అధ్యక్షులు బొడ మల్లేషము ప్రధాన కార్యదర్శులు నరేష్ పోతారం తిరుపతి లకవత శక్తి కేంద్రం ఇంఛార్జి మాలోత్ లక్పత్ వినోద్ న్యత రమేష్ భూక్యా రాజు బాజిరెడ్డి ప్రకాష్ బట్టు పీర్యా వినోద్ బండారి మహేష్ బుఖ్య రవి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News